America: చరిత్ర సృష్టించనున్న ట్రంప్.. అమెరికా డాలర్‌పై ఫోటో!
అమెరికా చరిత్రలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. ట్రంప్ చిత్రంతో 250 డాలర్ల కరెన్సీ నోటును తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
అమెరికా చరిత్రలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించనున్నారు. ట్రంప్ చిత్రంతో 250 డాలర్ల కరెన్సీ నోటును తీసుకురావాలని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది.
ఇరాన్‌తో చేతులు కలిపి హర్మూజ్ వద్ద నౌకల నుంచి ఎలాంటి టోల్ లేదా సుంకం వసూలు చేసినా సహించేది లేదని అమెరికా మిత్రదేశమైన ఒమన్‌ను హెచ్చరించింది. ఒకవేళ ఒమన్ ఇలాంటి చర్యలకు పాల్పడితే.. అమెరికా కఠినమైన ఆర్థిక ఆంక్షలు విధిస్తుంది.
గాజా భూభాగంలో 70 శాతానికి పైగా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలకు నెతన్యాహు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నెతన్యాహు వెల్లడించారు.
అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందం దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.
ఓ వైపు యుద్ధం జరుగుతుండటంతో ప్రధాని నెతన్యాహు ఆసుపత్రిలో చేరడంతో ఆరోగ్యంపై పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే నెతన్యాహు దంతాలకు సంబంధించిన చికిత్స కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు.
మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించాలని ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలకు.. అమెరికా మిత్రదేశమైన ఒమన్ మద్దతు ఇస్తుందేమోనని ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
బుండిబుగ్యో అనే కొత్త రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో WHO అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ఓ కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు.
ఇటీవల సీబీఎస్ఈ విడుదల చేసిన 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో విద్యార్థుల పేపర్లు మారడంతో.. 4 లక్షల మంది తమ ఫలితాల పేపర్లను చూడటానికి దరఖాస్తు చేసుకున్నారు.
హర్మూజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా దళాలు ఇరాన్‌కు చెందిన ఒక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టాయి. అయితే హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నాలుగు డ్రోన్లను ప్రయోగించింది.