America-Iran: అమెరికా యుద్ధ విమానం కూల్చేశామంటూ.. ఇరాన్ సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో శాంతి చర్చలు జరుగుతున్న వేళ.. మళ్లీ అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని తమ వైమానిక దళం కూల్చివేసిందని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.

New Update
FotoJet (1)

పశ్చిమాసియాలో శాంతి చర్చలు జరుగుతున్న వేళ.. మళ్లీ అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మేఘాలు కమ్ముకుంటున్నాయి. అయితే అమెరికాకు చెందిన ఓ యుద్ధ విమానాన్ని తమ వైమానిక దళం కూల్చివేసిందని ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌లోని బుషెహర్ ప్రావిన్స్‌లో ఉన్న జామ్ ప్రాంతంపై అమెరికా యుద్ధ విమానాలను పంపించింది. వీటిని కూల్చేశామని ఇరాన్ ఆర్మీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. అయితే ఈ ఆరోపణలను అమెరికా సెంట్రల్ కమాండ్ తోసిపుచ్చింది. తమ యుద్ధ విమానం ఏదీ కూలిపోలేదని, ఇరాన్ చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని తెలిపింది. ఇలాంటి అబద్ధపు వార్తలతో ఇరాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని అమెరికా మండిపడింది. ఒకవేళ ఇరాన్ ఫోటోలు చూపించినా, అవి పాతవైనా అయి ఉండవచ్చు లేదా ఫేక్‌వి అయి  ఉండవచ్చని తెలిపింది. 

ఇది కూడా చూడండి: Raidurgam : రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్: రాయదుర్గంలో ఎకరం స్థలం రూ.237 కోట్లు!

ఇది కూడా చూడండి: CM Siddaramaiah : రాజ్యసభ ఆఫర్ రిజెక్ట్.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన!

కాల్పుల విరమణకు ఒప్పందం..

ఇదిలా ఉండగా అమెరికా-ఇరాన్ మధ్య ఇప్పటికే అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఒప్పందంలో కేవలం కాల్పుల విరమణ పొడిగింపు మాత్రమే కాకుండా.. ఇరాన్ అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు ప్రారంభించనుంది. గత కొంత కాలంగా ఇరు దేశాల మధ్య జరిగిన దాడులు, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ చర్చలు జరగనున్నాయి. ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై సంతకం చేయాల్సి ఉంది. అధ్యక్షుడి ఆమోదం లభించిన తర్వాతే ఈ 60 రోజుల కాల్పుల విరమణ, తదుపరి చర్చల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. 

ఇది కూడా చూడండి: CM Revanth Reddy : మాకు ఇందిరమ్మ ఎంతో.. NTR కూడా అంతే : సీఎం రేవంత్ రెడ్డి

Advertisment
తాజా కథనాలు