/rtv/media/media_files/2026/03/23/trump-2026-03-23-17-53-22.jpg)
Trump
హర్మూజ్ జలసంధిపై తాజాగా అమెరికా సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌తో చేతులు కలిపి హర్మూజ్ వద్ద నౌకల నుంచి ఎలాంటి టోల్ లేదా సుంకం వసూలు చేసినా సహించేది లేదని అమెరికా మిత్రదేశమైన ఒమన్‌ను హెచ్చరించింది. ఒకవేళ ఒమన్ ఇలాంటి చర్యలకు పాల్పడితే.. అమెరికా విధించే కఠినమైన ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ స్పష్టం చేశారు. అమెరికా వార్నింగ్ ఇచ్చిన వెంటనే ఒమన్ స్పందించింది. ఒమన్ రాయబారితో తాను ఫోన్ ద్వారా మాట్లాడానని.. హర్మూజ్ జలసంధి వద్ద టోల్ వసూలు చేసే ఆలోచన తమకు లేదని ఒమన్ ప్రభుత్వం స్పష్టం చేసినట్లు స్కాట్ బెసెంట్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ఉన్న స్నేహపూర్వక సంబంధాలను అలాగే కొనసాగించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఇది కూడా చూడండి: Raidurgam : రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్: రాయదుర్గంలో ఎకరం స్థలం రూ.237 కోట్లు!
The US warns it would “aggressively” impose sanctions on Oman if it helps Iran establish a tolling system in the Strait of Hormuz, intensifying President Donald Trump’s threats against the Gulf ally. pic.twitter.com/Zmlj9t0eO8
— Iran Flash News (@FlashWireNews) May 28, 2026
ఇది కూడా చూడండి: CM Siddaramaiah : రాజ్యసభ ఆఫర్ రిజెక్ట్.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన!
ఆర్థిక ఆంక్షలు తప్పవు..
సైనిక చర్యలు, కఠినమైన ఆర్థిక ఆంక్షల వల్లే ఇరాన్ ఇప్పుడు చర్చలకు దిగిందని అమెరికా చెబుతోంది. ఇరాన్ అణు కార్యక్రమంపై తుది నిర్ణయం పూర్తిగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతుల్లోనే ఉందని బెసెంట్ స్పష్టం చేశారు. అయితే ట్రంప్ కొన్ని షరతులను పెట్టారు. ఇరాన్ తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను పూర్తిగా అప్పగించాలని, అణ్వాయుధాలను తయారు చేసే ఆలోచనను విరమించుకోవాలని అన్నారు. హర్మూజ్ జలసంధి గుండా అంతర్జాతీయ నౌకల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని తెలిపారు. ఈ షరతులకు ఇరాన్ అంగీకరిస్తే శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అంటోంది. అయిత ఈ ఒప్పందంపై ఇంకా ట్రంప్ సంతకం చేయాల్సి ఉంది.
ఇది కూడా చూడండి: CM Revanth Reddy : మాకు ఇందిరమ్మ ఎంతో.. NTR కూడా అంతే : సీఎం రేవంత్ రెడ్డి
⚡️BREAKING: The United States warns that it will impose sanctions on Oman if it cooperates with Iran on the Strait of Hormuz toll system
— Tiamoah (@Michael_Okante) May 28, 2026
Note that Oman plays a key role as a logistics hub for the U.S. Navy pic.twitter.com/JTRXQG5Sxv
ఇది కూడా చూడండి: Japan : ఇండియాకు జపాన్ బిగ్ షాక్: ఈగలున్నాయని మామిడి పండ్లపై బ్యాన్!
Follow Us