Strait of Hormuz: హర్మూజ్‌లో హై టెన్షన్.. ఇరాన్‌పై అమెరికా మెరుపు దాడి

హర్మూజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా దళాలు ఇరాన్‌కు చెందిన ఒక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టాయి. అయితే హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నాలుగు డ్రోన్లను ప్రయోగించింది.

New Update
FotoJet (11)

హర్మూజ్ జలసంధి ప్రాంతంలో అమెరికా దళాలు ఇరాన్‌కు చెందిన ఒక సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టాయి. అయితే హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న ఒక అమెరికా వాణిజ్య నౌకను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ నాలుగు డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడులను అడ్డుకునే క్రమంలోనే అమెరికా ఎటాక్ చేసినట్లు తెలుస్తోంది. టెహ్రాన్ నుంచి మరిన్ని దాడులు జరగకముందే.. ఆత్మరక్షణలో భాగంగా తాము ముందుగానే స్పందించామని అమెరికా అధికారులు పేర్కొన్నారు. తమ సైనిక బలగాలకు, వాణిజ్య నౌకల రాకపోకలకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు వారు స్పష్టం చేశారు.

ఇది కూడా చూడండి: Fighter Jets : కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రైవేటు సంస్థలకు ఫైటర్ జెట్ల తయారీ ఛాన్స్

ఇది కూడా చూడండి: Namitha: ట్రోలర్స్‌కు నమిత స్ట్రాంగ్ వార్నింగ్! అసలేమైందంటే..?

కాల్పుల విరమణ ఒప్పందాన్ని..

అమెరికా చేపట్టిన ఈ సైనిక చర్యలపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడింది. ఇరు దేశాల మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమెరికా ఉల్లంఘించిందని.. ఇది అనవసరమైన రెచ్చగొట్టే చర్య అని ఆరోపించింది. దాడులకు కొద్దిసేపటి ముందే.. ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ ఓడరేవు సమీపంలో భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు సమాచారం. దీంతో ఇరాన్ వైమానిక దళాలు అప్రమత్తమై ఆకాశంలో గస్తీని పెంచాయి. అయితే ఆ పేలుళ్లు దాడుల వల్ల జరిగాయా లేక మరే ఇతర కారణాల వల్ల జరిగాయా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి: Disha Mouni: దిశా-మౌనీ లెస్బియన్ రూమర్స్‌ పై మరో ట్విస్ట్… పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు?

ఇది కూడా చూడండి: Tamil Nadu CM Vijay : ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్..ఢిల్లీలో బిజీబిజీ

Advertisment
తాజా కథనాలు