/rtv/media/media_files/2026/05/28/fotojet-15-2026-05-28-12-14-32.jpg)
ప్రస్తుతం ఆఫ్రికా దేశాలైన కాంగో, ఉగాండాల్లో ఎబోలా వైరస్ కలకలం సృష్టిస్తోంది. ముఖ్యంగా ‘బుండిబుగ్యో’ అనే కొత్త రకం ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ.. అంతర్జాతీయ ఆరోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు ఓ కొత్త వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశారని రష్యా ఆరోగ్యశాఖ మంత్రి మిఖాయిల్ మురాష్కో ప్రకటించారు. ఈ వ్యాక్సిన్ కొత్త రకం ఎబోలా వైరస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ వ్యాక్సిన్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత.. అది వైరస్‌ను గుర్తించేలా రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. అలాగే వైరస్‌ను ఎదుర్కోవడానికి అవసరమైన యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. దీంతో ఎబోలా వైరస్ మనకు సోకినప్పుడు శరీరం వెంటనే స్పందించి ఆ వైరస్‌ను నాశనం చేస్తుంది. అయితే రష్యా వద్ద ఉన్న అధునాతన వ్యాక్సిన్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించింది.
ఇది కూడా చూడండి: Fighter Jets : కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రైవేటు సంస్థలకు ఫైటర్ జెట్ల తయారీ ఛాన్స్
🇷🇺🌍 Russia has developed preliminary vaccine solutions against the new #Ebola strain, Russian Health Minister M.Murashko said at the International Security Forum.
— Russian Embassy in Kenya/Посольство России в Кении (@russembkenya) May 27, 2026
🧬 Russia maintains “vaccine reserves” that allow rapid development of preventive drugs against emerging diseases. pic.twitter.com/v6bABNfeCc
ఇది కూడా చూడండి: Namitha: ట్రోలర్స్‌కు నమిత స్ట్రాంగ్ వార్నింగ్! అసలేమైందంటే..?
ఎలా పుట్టింది?
ఈ ఎబోలా వైరస్ గబ్బిలాల నుంచి పుట్టింది. అవి తిని వదిలేసిన పండ్లను లేదా వాటి విసర్జితాలను అడవిలోని కోతులు, చింపాంజీలు, అడవి పందులు వంటి జంతువులు తిన్నప్పుడు వాటికి ఈ వైరస్ సోకుతుంది. ఆఫ్రికాలో ప్రజలు ఇలాంటి అడవి జంతువులను వేటాడినప్పుడు లేదా వాటి మాంసాన్ని సరిగ్గా ఉడికించకుండా తిన్నప్పుడు.. ఆ వైరస్ మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తుంది.
ఇది కూడా చూడండి: Disha Mouni: దిశా-మౌనీ లెస్బియన్ రూమర్స్ పై మరో ట్విస్ట్… పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు?
ఒక్కసారి మనిషి శరీరంలోకి ఈ వైరస్ ప్రవేశించిన తర్వాత.. అది ఒక గొలుసు కట్టులా ఇతరులకు వ్యాపిస్తుంది. అయితే ఎబోలా వైరస్ కోవిడ్ లాగా గాలి ద్వారా వ్యాపించదు. అంటే ఎవరైనా తుమ్మినా, దగ్గినా ఆ గాలిని పీల్చుకోవడం వల్ల ఇది రాదు. ఇది కేవలం శరీర ద్రవాల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన రోగి రక్తం, చెమట, లాలాజలం, వాంతులు, మూత్రం లేదా వీర్యం వంటి ద్రవాలను వేరొకరు నేరుగా తాకడం వల్ల వైరస్ సోకుతుంది. మన చర్మంపై ఉండే చిన్న చిన్న గాయాల ద్వారా లేదా కళ్లు, ముక్కు, నోటి ద్వారా వైరస్ లోపలికి వెళ్తుంది.
ఈ వైరస్ లక్షణాలు
ఎబోలా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన వెంటనే లక్షణాలు కనిపించవు. దీనికి పట్టే సమయాన్ని ఇన్క్యుబేషన్ పీరియడ్ అంటారు. ఇది 2 నుండి 21 రోజుల వరకు ఉంటుంది. ఈ సమయంలో సదరు వ్యక్తి ఆరోగ్యంగానే కనిపిస్తాడు. కానీ లోపల వైరస్ తన సంఖ్యను పెంచుకుంటూ ఉంటుంది. లక్షణాలు మొదలైన తర్వాతే ఆ వ్యక్తి నుంచి ఇతరులకు వైరస్ వ్యాపిస్తుంది. తొలి దశలో సాధారణ జ్వరం, విపరీతమైన నీరసం, కండరాల నొప్పులు, గొంతు నొప్పి వస్తాయి. ఇవి సాధారణ ఫ్లూ లక్షణాల్లాగే ఉండటంతో చాలామంది అనుకుంటారు. కానీ రెండవ దశలో వాంతులు, విరేచనాలు, చర్మంపై దద్దుర్లు మొదలవుతాయి. చివరి దశలో కాలేయం వంటి అవయవాలు పూర్తిగా డ్యామేజ్ అవుతాయి. అంతర్గతంగా రక్తస్రావం జరగడం వల్ల కళ్లు, ముక్కు, చిగుళ్ల నుంచి రక్తం కారుతుంది. ఈ దశకు చేరుకున్న రోగి ప్రాణాలతో బయటపడటం కష్టం.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఎబోలా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండాలంటే చేయాల్సిన ముఖ్యమైన పని జాగ్రత్తపడటం. వ్యాధి సోకిన ప్రాంతాల్లో ప్రజలు అడవి జంతువుల మాంసానికి దూరంగా ఉండాలి. నిరంతరం చేతులను శానిటైజ్ చేసుకోవాలి. ప్రస్తుతానికి దేశంలో ఎబోలా ప్రభావం పెద్దగా లేదు. అలా అని లైట్ తీసుకోకుండా జాగ్రత్తలు తీసుకోకపోతే సోకే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Follow Us