/rtv/media/media_files/QxTDrIbunEZ8ah8hJWgL.jpeg)
Benjamin Netanyahu
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు జెరూసలెంలోని హదస్సా ఈన్ కెరెమ్ మెడికల్ సెంటర్‌లో చేరారు. ఓ వైపు యుద్ధం జరుగుతుండటంతో ప్రధాని నెతన్యాహు ఆసుపత్రిలో చేరడంతో ఆరోగ్యంపై పలు రకాల ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే నెతన్యాహు దంతాలకు సంబంధించిన చికిత్స కోసం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. గతంలో నెతన్యాహు తన ఆరోగ్యంపై అధికారిక ప్రకటన చేశారు. తనకు ప్రాస్టేట్ క్యాన్సర్ ఉందని, అది ప్రాథమిక దశలోనే ఉందని తెలిపారు. స్టార్టింగ్ స్టేజ్ కావడంతో చికిత్స తీసుకున్నట్లు వెల్లడించారు. ఆ సమయంలో యుద్ధ పరిస్థితుల దృష్ట్యా, ఇరాన్ వంటి శత్రు దేశాలు ఈ సమాచారాన్ని తప్పుగా ప్రచారం చేయకుండా ఉండేందుకు.. చికిత్స పూర్తి అయ్యే వరకు విషయాన్ని రహస్యంగా ఉంచినట్లు ఆయన తెలిపారు.
ఇది కూడా చూడండి: Fighter Jets : కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రైవేటు సంస్థలకు ఫైటర్ జెట్ల తయారీ ఛాన్స్
BREAKING 🇮🇱
— Walter Da2nd' Nibbleston (@NibbsWaltz224) May 26, 2026
Israeli Prime Minister Benjamin Netanyahu has reportedly been admitted to a hospital in Jerusalem.
Source: Jerusalem Times. pic.twitter.com/w90nizO882
ఇది కూడా చూడండి: Namitha: ట్రోలర్స్‌కు నమిత స్ట్రాంగ్ వార్నింగ్! అసలేమైందంటే..?
నెతన్యాహు గతంలో కూడా పలుమార్లు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 2023లో ఆయనకు పేస్‌మేకర్ అమర్చగా, 2024లో హెర్నియా శస్త్రచికిత్స జరిగింది. ఇలా వరుసగా ఆస్పత్రికి వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, తన విధులను యథావిధిగా కొనసాగిస్తున్నారని ప్రధాని కార్యాలయం చెబుతోంది. దంతాలకు సంబంధించిన చికిత్స పూర్తి అయ్యిందని, తిరిగి ఇంటికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: Disha Mouni: దిశా-మౌనీ లెస్బియన్ రూమర్స్ పై మరో ట్విస్ట్… పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు?
🚨 BREAKING 🇮🇱
— Iran NewsFeed (@IranNewsFeedX) May 26, 2026
Israeli Prime Minister Benjamin Netanyahu has reportedly been admitted to a hospital in Jerusalem.
Source: Jerusalem Times. pic.twitter.com/69AbeSKv1T
Follow Us