America-Iran: ట్రంప్ మాస్టర్ ప్లాన్.. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగిసినట్టేనా?

అమెరికా, ఇరాన్ దేశాలు శాంతి ఒప్పందం దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం.

New Update
Donald Trump

Donald Trump

అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇరు దేశాలు శాంతి ఒప్పందం దిశగా వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అమల్లో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరో 60 రోజుల పాటు పొడిగించేందుకు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ప్రాథమికంగా అంగీకారానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఈ ఒప్పందంలో కేవలం కాల్పుల విరమణ పొడిగింపు మాత్రమే కాకుండా.. ఇరాన్ అణు కార్యక్రమంపై మళ్లీ చర్చలు ప్రారంభించనుంది. గత కొంత కాలంగా ఇరు దేశాల మధ్య జరిగిన దాడులు, పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఈ చర్చలు జరగనున్నాయి.

ఇది కూడా చూడండి: Raidurgam : రియల్ ఎస్టేట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రికార్డ్: రాయదుర్గంలో ఎకరం స్థలం రూ.237 కోట్లు!

ఇది కూడా చూడండి: CM Siddaramaiah : రాజ్యసభ ఆఫర్ రిజెక్ట్.. సిద్ధరామయ్య సంచలన ప్రకటన!

సంతకం చేస్తేనే..

ఈ ఒప్పందం పూర్తిస్థాయిలో అమల్లోకి రావాలంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీనిపై సంతకం చేయాల్సి ఉంది. అధ్యక్షుడి ఆమోదం లభించిన తర్వాతే ఈ 60 రోజుల కాల్పుల విరమణ, తదుపరి చర్చల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమవుతుంది. ఇప్పటికే పశ్చిమాసియా ప్రాంతం తీవ్ర ఉద్రిక్తతలతో సతమతమవుతున్న వేళ.. ఈ ఒప్పందం కుదిరితే అది ప్రపంచ శాంతికి, ఆర్థిక స్థిరత్వానికి కొంత ఊరటనిస్తుంది.

ఇది కూడా చూడండి: CM Revanth Reddy : మాకు ఇందిరమ్మ ఎంతో.. NTR కూడా అంతే : సీఎం రేవంత్ రెడ్డి

ఇది కూడా చూడండి: Japan : ఇండియాకు జపాన్ బిగ్ షాక్: ఈగలున్నాయని మామిడి పండ్లపై బ్యాన్!

Advertisment
తాజా కథనాలు