/rtv/media/media_files/2026/05/02/trump-2026-05-02-15-19-50.jpg)
Trump
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయి. అయినా కూడా ప్రస్తుతం పరిస్థితులు ఉద్రిక్తత స్థాయికి చేరుకుంటున్నాయి. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌కు సపోర్ట్ చేస్తున్న దేశాలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హోర్ముజ్ జలసంధిపై నియంత్రణ సాధించాలని ఇరాన్ చేస్తున్న ప్రయత్నాలకు.. అమెరికా మిత్రదేశమైన ఒమన్ మద్దతు ఇస్తుందేమోనని ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చూడండి: Fighter Jets : కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రైవేటు సంస్థలకు ఫైటర్ జెట్ల తయారీ ఛాన్స్
🚨 BREAKING:
— IRGC NEWS (@IRGC_IRAN_News) May 27, 2026
🇮🇷🇺🇸 President Trump issues a sharp warning to Oman, saying the U.S. will take “massive action” if the country does not cooperate amid rising Gulf tensions and the Strait of Hormuz dispute. Regional pressure is rapidly escalating. pic.twitter.com/CuDBlPH4fg
ఇది కూడా చూడండి: Namitha: ట్రోలర్స్‌కు నమిత స్ట్రాంగ్ వార్నింగ్! అసలేమైందంటే..?
ఓ రిపోర్టర్ ట్రంప్‌ను అడగడంతో.. హోర్ముజ్ జలసంధి అంతర్జాతీయ జల మార్గమని.. తెరిచి ఉండాలని అన్నారు. ఏ ఒక్క దేశం కూడా దానిని నియంత్రించకూడదని స్పష్టం చేశారు. ఒమన్ కూడా అందరిలాగే బాధ్యతాయుతంగా వ్యవహరించాలని అన్నారు. ఒకవేళ లేకపోతే మేమే వారిని పేల్చివేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఒమన్ అమెరికాకు మిత్ర దేశం. ఈ క్రమంలో ట్రంప్ వార్నింగ్ ఇవ్వడంతో సంచలనం రేపుతోంది.
ఇది కూడా చూడండి: Disha Mouni: దిశా-మౌనీ లెస్బియన్ రూమర్స్ పై మరో ట్విస్ట్… పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు?
Real shock! 😱
— سيف الدرعي| Saif alderei (@saif_aldareei) May 27, 2026
Trump openly threatens Oman:
“Oman will behave like the others… or we will have to bomb them!”
Mr. Trump, Oman is a country of peace and wisdom, not a party to any escalation. https://t.co/wSGfnWAnOr
ప్రపంచ చమురు రవాణాలో ఐదవ వంతు ఈ హోర్ముజ్ జలసంధి గుండానే జరుగుతుంది. అయితే ఇరాన్ ఈ జలసంధి ద్వారా వెళ్లే నౌకలపై సుంకాలు విధించాలని.. ఈ ఆదాయాన్ని ఒమన్‌తో పంచుకోవాలని ప్లాన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ట్రంప్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Follow Us