/rtv/media/media_files/2026/05/28/fotojet-14-2026-05-28-11-12-25.jpg)
ఇటీవల సీబీఎస్ఈ విడుదల చేసిన 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాల్లో తీవ్ర గందరగోళం ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో విద్యార్థుల పేపర్లు మారడంతో.. 4 లక్షల మంది తమ ఫలితాల పేపర్లను చూడటానికి దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు హాజరైన ప్రతి నలుగురు విద్యార్థులలో ఒకరు అంటే.. దాదాపు 23 శాతం మంది తమ జవాబు పత్రాల స్కాన్ చేసిన కాపీల కోసం బోర్డుకు అప్లై చేసుకున్నారు. మొత్తం 17,68,968 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా.. వారిలో 4,04,319 మంది తమ పేపర్లను చూడటానికి బోర్డును ఆశ్రయించారు.
ఇది కూడా చూడండి: Fighter Jets : కేంద్రం సంచలన నిర్ణయం.. ప్రైవేటు సంస్థలకు ఫైటర్ జెట్ల తయారీ ఛాన్స్
So examiners could save their effort, justifies the process. What then is the reason of over 4 lac students ( many could not have) asking for their papers? What about error possibilities being accepted by CBSE based on actual cases? @sankethttps://t.co/AxTjGlwJ3b
— sunil vadehra (@sunil_vadehra) May 27, 2026
రీ వెరిఫికేషన్ మళ్లీ ప్రారంభం..
ఈ ఏడాది సీబీఎస్ఈ తన ఆన్-స్క్రీన్ మార్కింగ్ వ్యవస్థ ద్వారా దాదాపు 98 లక్షలకు పైగా జవాబు పత్రాలను పరిశీలన చేసింది. అయితే ఇప్పటివరకు అందిన అభ్యర్థనలలో 8,98,214 జవాబు పత్రాలను డిజిటల్ పద్ధతిలో విద్యార్థులకు అందించారు. పెండింగ్‌లో ఉన్న మిగిలిన దరఖాస్తులన్నింటినీ మే 27 నాటికి పూర్తి చేస్తామని బోర్డు స్పష్టం చేసింది. అంతేకాకుండా మే 29 నుండి రీ-వెరిఫికేషన్, రీ-ఎవాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఇది కూడా చూడండి: Namitha: ట్రోలర్స్‌కు నమిత స్ట్రాంగ్ వార్నింగ్! అసలేమైందంటే..?
డిజిటల్ విధానం అమలులో ఉన్నప్పటికీ.. విద్యార్థులు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా జవాబు పత్రాలను డౌన్‌లోడ్ చేయడంలో జాప్యం జరగడం, పోర్టల్ సరిగ్గా పనిచేయకపోవడం వంటి సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఫిర్యాదు చేశారు. కొన్ని స్కాన్ చేసిన కాపీలు అస్పష్టంగా ఉండటంతో, డిజిటల్ డాక్యుమెంట్ల నాణ్యతపై విద్యార్థుల్లో అసహనం వ్యక్తమవుతోంది. మాన్యువల్ చెకింగ్ మళ్లీ ప్రారంభించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Disha Mouni: దిశా-మౌనీ లెస్బియన్ రూమర్స్ పై మరో ట్విస్ట్… పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారు?
ఈ పరీక్షా ప్రక్రియతో పాటు ఒక కొత్త వివాదం కూడా తెరపైకి వచ్చింది. సీబీఎస్ఈ ఆన్-స్క్రీన్ మార్కింగ్ వ్యవస్థను తాను హ్యాక్ చేశానని 19 ఏళ్ల విద్యార్థి ఒకరు ఆరోపించారు. దీనిపై సీబీఎస్ఈ వెంటనే స్పందిస్తూ.. ఆ ఆరోపణలను ఖండించింది. సదరు వ్యక్తి పేర్కొన్న పోర్టల్ కేవలం పరీక్షా అవసరాల కోసం ఉపయోగించే అంతర్గత వ్యవస్థ మాత్రమేనని, అందులో అసలైన విద్యార్థుల డేటా లేదని స్పష్టం చేసింది. అయితే ఆ విద్యార్థి తాను సేకరించినట్లుగా చెబుతున్న కొన్ని స్క్రీన్‌షాట్‌లను, వీడియో సాక్ష్యాలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ గొడవ మొదలైంది.
ఇది కూడా చూడండి: Tamil Nadu CM Vijay : ప్రధానిని కలిసిన తమిళనాడు సీఎం విజయ్..ఢిల్లీలో బిజీబిజీ
Follow Us