USA: అలస్కాలో విమానం మిస్సింగ్..
అలస్కా నుంచి పది మందితో బయలుదేరిన ఓ విమానం మిస్ అయింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.37కు బయలుదేరిన జెట్..3.16 తరువాత రాడార్ కు అందకుండా పోయింది. ప్రస్తుతం దీని గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
అలస్కా నుంచి పది మందితో బయలుదేరిన ఓ విమానం మిస్ అయింది. అమెరికా కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.37కు బయలుదేరిన జెట్..3.16 తరువాత రాడార్ కు అందకుండా పోయింది. ప్రస్తుతం దీని గాలింపు చర్యలు జరుగుతున్నాయి.
దక్షిణ కొరియాలో 176 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మంటల్లో చిక్కుకుంది. బుసాన్ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
రాజస్థాన్లోని జోధ్పూర్లో ఓ ఆసక్తికర ఘటన వెలుగుచూసింది. విమానం టేకాఫ్కు సిద్ధంగా ఉండగా.. ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరవడం కలకలం రేపింది. దీంతో సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేశారు.
చెన్నై ఎయిర్ పోర్ట్ లో నిన్న అర్ధరాత్రి హైటెన్షన్ నెలకొంది. టేకాఫ్ అయిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు తమ దగ్గర బాంబు ఉందని...పేల్చేస్తామని బెదిరించారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళం ఏర్పడింది.
యూపీలో మహా కుంభమేళా నిర్వహిస్తున్న నేపథ్యంలో ప్రయాగ్రాజ్ కు వెళ్లే విమానాల టికె్ ధరలు గణనీయంగా పెరిగాయి. నిన్న మొన్నటి వరకు రూ.2977 గా ఉన్న టికెట్ ధర ఇప్పుడు ఏకంగా 498 శాతం పెరిగింది.అంటే టికెట్ ధర రూ.17,796 గా కొనసాగుతోంది.
సంక్రాంతి పండుగ వేళ విమాన టికెట్లకు భారీగా డిమాండ్ పెరిగింది. శని, ఆదివారాల్లో హైదరాబాద్ నుంచి విశాఖకు ఫ్లైట్ టికెట్ కనీస ధర రూ.17,500లకు పైగా ఉంది. బెంగళూరు నుంచి విశాఖపట్నంకు వెళ్లాలంటే కనీస ధర రూ.12 వేలు ఉంది.
దక్షిణ కొరియా ముయాన్ విమానాశ్రయంలో దుర్ఘటన రిగిన తర్వాత అక్కడి జనాలు ప్రయాణాలు అంటేనే భయపడిపోతున్నారు. దాంతో మొత్తం బుకింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసేసుకుంటున్నారు. ఇప్పటివరకు 68వేల రిజర్వేషన్లు రద్దు అయ్యాయి.