/rtv/media/media_files/2025/02/11/UjGVCLE7l6ydKOLqK5NL.jpg)
Rachel Kaur Photograph: (Rachel Kaur)
ఆఫీస్ 30 కిలో మీటర్ల దూరం ఉంటేనే జర్నీ చేయాలంటే తలప్రాణం తోకకు వస్తోంది. అలాంటి ఓ మహిళ రోజూ రానుపోను 700 కిలో మీటర్లు ప్రయాణిస్తూ జాబ్ చేస్తోంది. అది కూడా ఓ ఇద్దరు పిల్లలతో సంసారాన్ని నెట్టుకొస్తూ, ఇంట్లో పనులు చేసుకుంటూ. ఇండియాలో పుట్టిపెరిగిన రాచెల్ కౌర్ మలేషియాలో ఎయిర్ ఏషియాలో అసిస్టెంట్ ఫైనాన్స్ మేనేజర్‌గా పని చేస్తోంది. రోజు ఆమె 700 కిలో మీటర్లు ట్రావెల్ చేస్తూ డ్యూటీ చేయాలి.
Also Read: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు!
ఉదయాన్నే 4 గంటలకు లేచి కౌర్ ఇంటి పనులు చక్కబెడుతుంది. ఆమెకు ఇద్దరు పిల్లలు వారికి ఫుడ్ ప్రిపేయిర్ చేసి.. వందల కిలో మీటర్లు ఆకాశంలో ట్రావెల్ చేసి ఆఫీస్‌కు వెళ్తోంది. కౌర్ ఉదయం 5 గంటలకు ఇంటి నుంచి బయలుదేరుతుంది. 6.30 వరకు పెనాంగ్ వెళ్లి.. అక్కడి నుంచి ట్రావెల్ చేసి కౌలాలంపూర్‌కు విమానంలో చేరుకుంటుంది. ఉదయం 7గంటల45 నిమిషాలకు ఆఫీస్‌కు వెళ్తోంది. పని చేస్తున్న ఎయిర్ లైన్స్ సర్వీస్‌నే వాడుతున్నందున ఆమెకు ట్రావెల్ ఖర్చులు తక్కువగా ఉంటాయని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. వారానికి 5రోజులు రాచెల్ కౌర్ ఇలా డ్యూటీకి వెళ్లాల్సి ఉంటుంది. 2024 జనవరి నుంచి కౌర్ ఫ్లైట్‌లో వెళ్లి డ్యూటీ చేస్తోంది.
Also Read: ఉక్రెయిన్లు రష్యన్లు కావొచ్చు.. ట్రంప్ సంచలన ప్రకటన
ఇంతకు ముందు ఆమె ఆఫీస్ కౌలాలంపూర్‌కు దగ్గరలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని, వారానికి ఒకసారి మాత్రమే మలేషియాలోని పెనాంగ్ రాష్ట్రానికి తిరిగి వెళ్లేది. అయితే, ఆమె పిల్లలకు దూరంగా ఉండటం ఫ్యామిలీ లైఫ్ కోల్పోయేది. దీంతో కౌర్ ఇంటికి వచ్చి పిల్లలతో టైం గడుపుతూ ఇంటి నుంచే ఆఫీస్‌కు వెళ్తోంది. కౌలాలంపూర్‌లో అద్దెకు ఇల్లు తీసుకున్నప్పుడు ఆమెకు నెలకు కనీసం $474 (రూ. 41,000) ఖర్చు చేసేది. ఇప్పుడు, ఆమె ట్రావెల్ ఛార్జెస్ $316 ( రూ. 27,000) మాత్రమే.