/rtv/media/media_files/2025/02/16/PC6hDZZFSOQIjmC2d5dS.jpg)
Second Batch Flight Landed In Amrithsar
అమెరికా నుంచి అక్రమ వలసదారులను వరుసపెట్టి వెళ్లగొడుతున్నారు. స్వయంగా విమానాలు వేసి మరీ పంపించేస్తున్నారు. ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన కింద అధికారులు సైతం స్ట్రిక్ట్ గా ఉన్నారు. ఏ దేశం వారైనా సరే క్షమించేది లేదనే చెబుతున్నారు. బారతదేశం పట్ల కూడా ఇదే తీరుతో వ్యవహరిస్తున్నారు. ప్రధాని మోదీ ఎంత మంచి ఫ్రెండ్ అయినా...భారత్ ఎంత మిత్ర దేశమైనా అక్రమ వలసదారులను ఉంచే సమస్యే లేదని స్పష్టం చేశారు. దీంతో భారత్ నుంచి అమెరికాకు అక్రమంగా వెళ్ళినవారిని వరుసపెట్టి పంపించేస్తున్నారు. మొదటి విడతలో కొంత మంది ఇండియా తిరిగి వచ్చారు.
నిన్న రాత్రి అమృత్ సర్ చేరిన రెండో విమానం
రెండో విడతలో మరో 116 మంది ఇండియాకు తిరిగి వచ్చారు. వీరిని తీసుకువచ్చిన విమానం నిన్న రాత్రి 11.30 కు అృత్ సర్ కు చేరుకుంది. మొదట విమానం 10 గంటలకు ల్యాండ్ అవుతుందని అన్నారు. కానీ అది కాస్తే లేట్ అయి 11.30 కు వచ్చింది. వీరంతా అమెరికా, మెక్సికో సరిహద్దుల్లో దొరికనవారే. అయితే మొదటి విడతలో వారిలా ఇప్పుడు వచ్చిన వారిని సంకెళ్ళు వేసి తీసుకుని వచ్చారో లేదో తెలియలేదు. రెండో విడతలో వచ్చిన వారిలో పంజాబ్ నుండి 65 మంది, హర్యానా నుండి 33 మంది, గుజరాత్ నుండి ఎనిమిది మంది, ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ నుండి ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుండి ఒక్కొక్కరు ఉన్నారు.వీరిలో ఎక్కువ మంది 18 నుండి 30 సంవత్సరాల మధ్య వయస్సు గలవారు.
ఇక అక్రమ వలసదారులతో మూడవ విమానం 157 మందితో ఫిబ్రవరి 16న ఇండియాకు రానుంది.
అక్రమ వలసదారుల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానం సరైనదేనని భారత ప్రధాని మోదీ అన్నారు. తమ దేశ పౌరులను భారతదేశం అంగీకరిస్తుందని స్పష్టం చేశారు. అక్రమ వలసదారుల అంశంపై ప్రధానమంత్రి మోడీ తన స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇది భారతదేశం సమస్య మాత్రమే కాదని అన్నారు. ఇది ప్రపంచవ్యాప్త సమస్య. ఇతర దేశాలలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్న ప్రజలకు అక్కడ నివసించడానికి చట్టబద్ధమైన హక్కు లేదు.
భారతదేశం, అమెరికా విషయానికొస్తే, ఒక వ్యక్తి భారత పౌరసత్వం నిర్ధారించబడి, అతను అమెరికాలో చట్టవిరుద్ధంగా నివసిస్తున్నట్లయితే, భారతదేశం అతన్ని తిరిగి తీసుకోవడానికి సిద్ధంగా ఉందన్నారు.