/rtv/media/media_files/2025/02/24/RMUEkvoNgcvEln2gxTqM.jpg)
american air lines flight Photograph: (american air lines flight)
American Airlines: న్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి(New York to Delhi) వస్తున్న అమెరికన్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం ఆదివారం అత్యవసరంగా రోమ్‌కు మళ్లించబడింది. AA292 విమానం ఫిబ్రవరి 22న న్యూయార్క్‌లోని JFK అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది. 199 మంది ప్రయాణీకులతో బోయింగ్ విమానం ఢిల్లీకి చేరుకోవాల్సి ఉంది. కానీ రోమ్‌లోని ఫియుమిసినో ఎయిర్‌పోర్ట్‌కు మళ్లించింది అమెరికన్ ఎయిర్‌లైన్స్ సిబ్బంది.
American Airlines flight from New York to India makes an emergency landing in Rome following a bomb threat
— Culture War (@CultureWar2020) February 23, 2025
⚠️ Bomb Threat Forces American Airlines Flight AA292 from New York to Delhi to Make Emergency Landing in Rome
Rome, Italy – February 23, 2025, 09:47 AM CST – A Delhi-bound… pic.twitter.com/XVjUTr2aNS
Also Read: Hezbollah-Nasralla: నసల్లా అంత్యక్రియలు..జనసంద్రంగా మారిన రోడ్లు..!
ఫ్లైట్‌లో బాంబు..!
ఫ్లైట్‌లో బాంబు ఉందని బెదిరింపులు రావడంతో వెంటనే ఎయిర్‌లైన్స్ సిబ్బంది అప్రమత్తమైయ్యారు. హుటాహుటిన ఫ్లైట్‌ను రోమ్‌లోని లియోనార్డో డా విన్సీ రోమ్ ఫియుమిసినో విమానాశ్రయంలో సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. బాంబ్ స్క్వాడ్‌లో విమానంలో తనిఖీలు చేశారు. ఎలాంటి అనుమానస్పద పేలుడు పదార్థాలు లేవని US ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వారు నిర్థారించింది. రోమ్‌లో ఎమెర్జెన్సీ ల్యాండింగ్ అయిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
ఇది కూడా చదవండి: Champions Trophy: ఎడారి దేశంలో...దాయాది పోరులో రికార్డుల మోత
Also Read: Slbc Tunnel Accident: ఆ 8 మంది ఎక్కడ...ఎలా ఉన్నారో...సవాల్ గా మారిన సహాయక చర్యలు!