/rtv/media/media_files/2025/02/07/9rv5VNkj3AMf6UXrlt2v.jpg)
Flight Missed In Alaska
అలస్కా నుంచి బయలుదేరిన విమానం ఒకటి మిస్ అయింది. మధ్యాహ్నం 2.37 నిమిషాలకు ఇది టేకాఫ్ అయింది. ఈ జెట్ విమానం అలస్కాలోని ఉనల్కలేట్ నుంచి నోమ్ కు వెళుతోంది. బయలుదేరిన తరువాత 3.16 గంటల నుంచి విమానం రాడార్ సిగ్నల్ మిస్ అయిందని చెబుతున్నారు. నార్టోన్ సౌండ్ ఏరియాలో ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సహాయక బృందాలు ఇప్పటికే అక్కడికి చేరుకొన్నాయి. ఇందులో మొత్తం పదిమంది ఉన్నారు. సెసనా 208బి అనే గ్రాండ్ కారవాన్ ఎయిర్ క్రాఫ్ట్ లో పైలట్ తో కలిపి పదిమంది ఉన్నారు. ప్రమాదంలో వీరందరూ మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు.
అంతకు ముందు ఫిలడెల్ఫియాలో షాపింగ్ మాల్ దగ్గర ఓ విమనం కూలిపోయింది. ఇళ్ళు ఉన్న ప్రదేశంలో ఈ జెట్ కూలిపోయింది. కూలిన చోట పెద్దగా మంటలు వ్యాపించాయి. దట్టమైన పొగ కూడా వ్యాపించింది. దీనిలో విమానంలో ఉన్నవారే కాక కింద ఉన్న ఇళ్ళల్లో ఉన్నవారు మృతి చెందారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇళ్లు, కార్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గురైన ఈ విమానం మెడికల్ ట్రాన్స్‌పోర్టర్‌గా అధికారులు గుర్తించారు. ఆ సమయంలో విమానంలో నలుగురు సిబ్బందితో పాటు.. ఓ చిన్నారి, ఆమె తల్లి ఉన్నారు. వీరంతా ప్రాణాలు కోల్పోయారు.
అమెరికాలో 15 రోజుల వ్యవధిలో ఇది మూడో విమానం ప్రమాదానికి గురవ్వడం. మొదట వాషింగ్టన్ రీగన్ ఎయిర్ పోర్ట్ దగ్గర విమానాన్ని, సైనిక హెలికాఫ్టర్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఇందులో మొత్తం 68 మంది ప్యాసెంజర్లు, నలుగురు సిబ్బందితో పాటూ హెలికాఫ్టర్ లో ఉన్న ముగ్గురు సైనికులు కూడా దుర్మరణం పాలయ్యారు. తరువాత ఫిలడెల్పియాలో విమానం కూలిన ఘటన. ఇప్పుడు అలస్్కాలో విమానం మిస్ అయింది.
🚨Plane carrying 10 people goes missing over Alaska.
— Prometheus ♒ (@wherefami) February 7, 2025
I'm telling you this guy was telling the truth.
former FBI Agent: "these types of accidents will often happen in three's or more so it would not surprise me if we, within the next month, we have another accident." pic.twitter.com/jRikvQ974A