/rtv/media/media_files/2025/03/20/yCXgUy6TSfKqSYRznfyv.jpg)
Bank Employees Strike
Bank Employees Strike : బ్యాంకు ఉద్యోగుల సమ్మె సరైన్ మోగింది. ఈనెల 24, 25 తేదీల్లో బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. అయితే ఈ రెండు రోజుల పాటు దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించనున్నట్లు బ్యాంక్ యూనియన్ల ఐక్య వేదిక యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్-యూఎఫ్బీయూ తెలిపింది. ఉద్యోగుల సంస్థ కీలక డిమాండ్లపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ)తో జరిగిన చర్చల్లో ఎటువంటి సానుకూల ఫలితం రాలేదని యుఎఫ్‌బియు తెలిపింది. దీంతో సమ్మె తప్పదంటుంది. బ్యాంకుకు సంబంధించిన ఏదైనా పని పూర్తి చేయాల్సి వస్తే, శుక్రవారం అంటే మార్చి 21 నాటికి దాన్ని పూర్తి చేసుకోండి. దీని తర్వాత మార్చి 22 నుండి మార్చి 25 వరకు బ్యాంకులు మూసి ఉండనున్నాయి. మార్చి 26న బ్యాంకులు తెరుచుకుంటాయి. శనివారం 22, ఆదివారం 23 తేదీలలో బ్యాంకులు మూసి ఉంటాయి. దీని తర్వాత సోమవారం, మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మె నిర్వహించనున్నారు.
ఇది కూడా చూడండి: HYD: ఎల్బీ నగర్ లో దారుణం..బైక్ ను ఢీకొట్టి కిలోమీటర్ ఈడ్చుకెళ్ళిన కారు
మంగళవారం న్యూఢిల్లీలో బ్యాంకులతో ప్రభుత్వం జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిసిన తర్వాత మార్చి 23, 24 తేదీలలో దేశవ్యాప్త సమ్మెను ప్రకటించారు. బ్యాంకుల్లో తగినంత నియామకాలు, అన్ని శాఖలలో సెక్యూరిటీ గార్డులను నియమించడం, ఐదు రోజుల బ్యాంకింగ్ పనిదినాలు, పాత పెన్షన్ పునరుద్ధరణ, అలాగే ప్రవేట్ వ్యక్తులకు వివిధ పనులను అప్పగించడం వంటి వాటికి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగులు నిరసన తెలుపుతున్నారు. దీనితో పాటు, కాంట్రాక్ట్ కార్మికులను క్రమబద్ధీకరించాలనే డిమాండ్లపై బ్యాంకు ఉద్యోగులు పనిచేయరు.
Also Read: Sub Inspector: లీవ్ లెటర్ బయటపెట్టిన స్కామ్.. లేడీ SI ఊచలు లెక్కించింది
సామాన్య ప్రజలతో పాటు, చిన్న, పెద్ద వ్యాపారవేత్తలు కూడా సమస్యలను ఎదుర్కొంటున్నారు. బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూసివేయడం వల్ల దేశం పెద్ద ఆర్థిక నష్టాన్ని చవిచూడటం ఖాయం. దీని కారణంగా ప్రభుత్వంతో పాటు సామాన్యుల పని కూడా ప్రభావితమవుతుంది. బ్యాంకుల నాలుగు రోజుల సమ్మె దేశంలో వ్యాపార కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ప్రతిరోజూ వ్యాపారులు, సేవా ప్రదాతలు, కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమలు, చిన్న వ్యాపారాలు, ఇతర రంగాలు బ్యాంకింగ్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాయి. ఇది వారి బ్యాంకింగ్ కార్యకలాపాలపై చెడు ప్రభావం చూపుతుంది. బ్యాంకులు మూసివేయడం వల్ల NEFT ద్వారా లావాదేవీలు నిలిచిపోతాయి. దీని కారణంగా భారీ నష్టాలు సంభవించే అవకాశం ఉంది. ఈ సమ్మె కారణంగా చెక్కుల క్లియరెన్స్, ఏటీఎం పనితీరుతో సహా అనేక ముఖ్యమైన సేవలు ప్రభావితమవుతాయి.
Also Read: USA: శాంతి ఒప్పందంపై జెల్స్ స్కీ కు ట్రంప్ కాల్..సుదీర్ఘ చర్చ
మీడియా నివేదికల ప్రకారం.. బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాఫ్ అసోసియేషన్ యుపి ప్రావిన్షియల్ జనరల్ సెక్రటరీ అనంత్ మిశ్రా మాట్లాడుతూ.. అన్ని బ్యాంకుల ఉమ్మడి సంస్థ అయిన యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అఖిల భారత సమ్మెకు పిలుపునిచ్చిందని అన్నారు. అయితే ఈ సమయంలో యుపిఐ, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు యథావిధిగా కొనసాగుతాయి.