-
Feb 01, 2025 07:46 IST
BREAKING: అమెరికాలో మరో విమాన ప్రమాదం.. ఆరుగురు మృతి
మరో విమాన ప్రమాదం అమెరికాలో చోటుచేసుకుంది. ఫిలడెల్పియాలో షాపింగ్ మాల్ సమీపంలో విమానం ఇళ్లపై కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు మృతి చెందారు. సమీపంలోని కార్లు, ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
-
Feb 01, 2025 06:55 IST
Maha Kumbh Mela: రైల్వేశాఖకు పెద్ద షాకిచ్చిన భక్తుడు.. కుంభమేళాకు వెళ్లలేకపోయినందుకు 50 లక్షల నష్ట పరిహారం కట్టాల్సిందే!
బిహార్ కి చెందిన ఓ వ్యక్తి కుంభమేళాకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులతో కలిసి రైల్వే స్టేషన్‌కి వెళ్లాడు.తీరా రైలు ఎక్కే సమయానికి తలుపులు తెరుచుకోలేదు.దీంతో కుంభమేళాకు వెళ్లలేదు. ఇందుకు గానూ రైల్వే శాఖ రూ.50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు.
-
Feb 01, 2025 06:27 IST
Cricket: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
మూడో మ్యాచ్ లో ఓడిపోయిన టెన్షన్ పెట్టిన టమ్ ఇండియా నాలుగో టీ 20 మ్యాచ్ లో మాత్రం అదరగొట్టారు. దీంతో ఇంకా ఒక మ్యాచ్ మిగిలుండగానే సీరీస్ ను కైవసం చేసుకున్నారు. కీలకమైన నాలుగో మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో విజయబావుటా ఎగురవేసింది భారత జట్టు.
🛑LIVE NEWS UPDATES: హమ్మయ్యా...సీరీస్ కొట్టేశారు..నాలుగో టీ20లో భారత్ ఘన విజయం
New Update
తాజా కథనాలు