Latest News In Telugu Telangana: తెలంగాణ వ్యాప్తంగా రూ.155 కోట్లు సీజ్ తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.155 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.61.11 కోట్ల నగదు, రూ.19.16 కోట్ల నగలు, రూ. 28.92 కోట్ల మద్యం, రూ.23.87 కోట్ల డ్రగ్స్, రూ.22.77 కోట్ల విలువైన వస్తువులు సీజ్ చేశామన్నారు. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sangareddy Accident: పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా.. ఇద్దరి మృతి సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం మన్సాన్పల్లి శివారులో పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 20 మందికి గాయాలు అయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. జోగిపేట ప్రభుత్వాస్పత్రికి క్షతగాత్రుల తరలించారు. By V.J Reddy 27 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu KA Paul: ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూమోహన్ ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల ప్రజాశాంతి పార్టీలో చేరిన మాజీ మంత్రి బాబూమోహన్ కు కీలక పదవీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూమోహన్ ను నియమించారు. By V.J Reddy 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ex DSP Praneeth Rao : ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతి రావు కలిసి ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో పోలీస్ అధికారులు గుర్తించారు. By V.J Reddy 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CP Radhakrishnan: యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్న గవర్నర్ TG: హైదరాబాద్‌లోని చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి అమ్మవారిని కుటుంబ సభ్యులతో వెళ్లి దర్శించుకున్నారు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్. అనంతరం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. గవర్నర్ వెంట సీఎస్ శాంతికుమారి వెళ్లారు. By V.J Reddy 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MLA KTR: ముందు క్షమాపణ చెప్పు.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ లేఖ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేటీఆర్. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని అన్నారు. గతంలో ఎల్ఆర్ఎస్ను ఉచితంగా ఇస్తామని ఇచ్చిన మాటను తప్పినందుకు ప్రజలను క్షమాపణ కోరాలని లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. By V.J Reddy 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth Reddy: తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక ప్రకటన తెలంగాణ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే వైబ్రంట్ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్ ప్రకటించబోతున్నట్టు తెలిపారు. మొత్తం తెలంగాణను మూడు విభాగాలుగా సమాన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. By V.J Reddy 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం రాయితీని కల్పించింది. By V.J Reddy 06 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medaram Jathara: మేడారం హుండీ లెక్కింపు.. బయటపడ్డ 100 రూపాయల అంబేడ్కర్ నోటు మేడారం మహాజాతర హుండీ లెక్కింపులో నకిలీ కరెన్సీ నోట్లు రావడం కలకలం రేపింది. ఓ హుండీలో అంబేడ్కర్ ఫొటోతో నకిలీ రూ.100 నోట్లు కనిపించాయి. భారత కరెన్సీపై అంబేడ్కర్ ఫోటోను ముద్రించాలన్న డిమాండ్‌తో ఆ నోట్లను కొందరు హుండీలో వేసినట్లుగా అధికారులు భావిస్తున్నారు. By V.J Reddy 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn