/rtv/media/media_files/Im4K3O2M7sfd5gfohKJ6.jpg)
చిన్నా,పెద్దా తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతీకార సుంకాల మోత మోగించిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ట్రంప్ ఏర్పాటు చేసిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషీయన్సీ శాఖ సారథి, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సుంకాల పై కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తుల్లో యూఎస్-యూరప్ దేశాల మధ్య జీరో సుంకాలు చూడాలని,తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.
Also Read: Rain Alert: మళ్లీ వర్షాలు.. ఈ జిల్లాల వాసులకు హెచ్చరికలు!
ఇటలీ లీగ్ నాయకుడు మాటియో సాల్విని ఇంటర్వ్యూలో మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. అమెరికా-యూరప్ దేశాల మధ్య భవిష్యత్తులో చాలా సన్నిహితమైన,బలమైన భాగస్వామ్యం ఏర్పడుతుంది.దీంతో ఇరు దేశాల మధ్య ఎలాంటి సుంకాలు ఉండవని ఆశిస్తున్నా అని మస్క్ వ్యాఖ్యానించారు. ట్రంప్ ఇటలీతో సహా ఇతర యూరోపియన్ యూనియన్ దేశాలకు 20 శాతం టారిఫ్‌లు ప్రకటించారు.
Also Read: APSRTC: ఏపీ ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే న్యూస్ చెప్పిన ఏపీఎస్‌ఆర్టీసీ !
ఈ సుంకాల పై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని స్పందిస్తూ...అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ఇప్పటికే తెలిపారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ఇప్పటికే తెలిపారు. అమెరికా ప్రభుత్వంతో సుంకాల పై చర్చలు కోరుకుంటున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి జియాన్ కార్లో గియోర్గెట్టి తెలిపారు.
ప్రతీకార సుంకం విధించబోమన్నారు. ఇక మస్క్,మెలోనీల మధ్యమంచి సంబంధాలు ఉన్నాయి.ఇటీవల మస్క్ తమ దేశ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నాని నార్వే, బ్రిటన్,ఫ్రాన్స్ దేశాధినేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే వీటిని మెలోని ఖండిస్తూ...మస్క్ కు మద్దతుగా నిలిచారు. మస్క్ లెఫ్ట్ వింగ్ కాకపోవడం వల్లే ఆ దేశాలన్నీ ఆయన పై అగ్రహం వ్యక్తం చేస్తున్నాయన్నారు.
Also Read: Horoscope: నేడు ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు!
america | europe | trump tariffs | trump tariffs news | donald trump tariffs | elanmusk | elan-musk | doze | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates