/rtv/media/media_files/2025/04/03/9FVaTTkVR8tpsbGzExCD.jpg)
trump tax on india Photograph: (trump tax on india)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన ప్రతీకార సుంకం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. సుంకం ఎఫెక్ట్ వల్ల స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవుతుండగా.. బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. పరస్పర సుంకాల ప్రభావం ఆర్థిక మార్కెట్లను కుదిపేస్తోంది. ఈ సుంకాల ఫలితంగా ఇప్పటికే స్టాక్ మార్కెట్లు ఒకవైపు భారీగా కుదేలవుతుండగా.. మరోవైపు బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
ప్రపంచ ఆర్థిక వృద్ధిపై..
ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు కూడా భారీగా పతనమవుతున్నాయి. తాజాగా అయితే చమురు ధరలు 5 నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. ఏప్రిల్ 3వ తేదీన బ్రెంట్ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 8 శాతం వరకు క్షీణించి 70 డాలర్ల కంటే తక్కువకు చేరింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్‌లో క్రూడాయిల్ ధర కూడా భారీగా తగ్గింది. 8 శాతం వరకు తగ్గి 65.62 డాలర్లకు చేరుకుంది. వీటివల్ల ప్రపంచ ఆర్థిక వృద్ధిపై తీవ్రంగా ప్రభావం పడుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!
ట్రంప్ ప్రతీకార సుంకాలను పలు దేశాలపై విధించారు. భారతదేశంపై ట్రంప్ 26 శాతం టారిఫ్ విధించాడు. ఈ సుంకాల వల్ల దేశంలో ఆర్థిక కార్యకలాపాలు మందగించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే క్రూడాయిల్‌ను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. సుంకాలు వల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: KKR VS SRH: మరీ ఇంత దారుణంగానా..ఎస్ఆర్హెచ్ కు ఏమైంది?
గతంలో రష్యా- ఉక్రెయిన్ యుద్ధ సమయంలో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. కానీ దేశంలో మాత్రం ధరలు స్థిరంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు అంతర్జాతీయంగా చమురు ధరలు పడిపోతున్న నేపథ్యంలో.. దేశంలో కూడా ఇంకా చమురు ధరలు తగ్గే అవకాశం ఉందని కొందరు నిపుణులు అంటున్నారు.
ఇది కూడా చూడండి: Pornography: పోర్న్ వీక్షకులకు బిగ్ షాక్.. 3 నెలల్లో 15 మంది అరెస్ట్.. ఎందుకో తెలుసా!
america | prices | diesel | petrol | donald-trump | international news in telugu | national news in Telugu | business news telugu | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu