పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన 'ఎల్2: ఎంపురాన్ ' చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. గుజరాత్ అల్లర్ల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఓ వర్గాన్ని తక్కువ చేసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇప్పటికే నటుడు మోహన్ లాల్ క్షమాపణలు కూడా చెప్పారు. ఇబ్బంది కలిగించే సన్నివేశాలను తొలగించేందుకు చిత్రబృందం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అయితే మోహన్ లాల్ క్షమాపణలు చెప్పడం..ఇప్పుడు మరో చర్చకు తెరలేపింది. అసలు సినిమాలో అలాంటి సన్నివేశాలు ఉన్నట్లుగా మోహన్ లాల్ కి ఏ మాత్రం తెలియదని, డైరెక్టర్ పృథ్వీరాజ్.. మోహన్‌లాల్‌కు తెలియకుండా స్క్రిప్ట్‌లోని కొన్ని భాగాలను జోడించారని, నిర్మాతలను తప్పుదోవ పట్టించారని కొంతమంది ఆరోపిస్తున్నారు.
'എമ്പുരാൻ' എന്ന സിനിമയെ കുറിച്ചുള്ള വിവാദം കഴിഞ്ഞ കുറെ ദിവസങ്ങളായി ഞാൻ ശ്രദ്ധിക്കുക ആയിരുന്നു.ഈ ചിത്രത്തിന്റെ സംവിധായകൻ...
Posted by Sukumaran Mallika on Sunday, March 30, 2025
బలిపశువు చేస్తున్నారు..
ఈ క్రమంలో ప్రముఖ నటి మల్లికా సుకుమారన్ తన కుమారుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కు మద్దతుగా ముందుకు వచ్చారు . మోహన్ లాల్, చిత్ర నిర్మాతలను పృథ్వీరాజ్ తప్పుదారి పట్టించాడనే ఆరోపణలను ఖండించారు. ఆ వాదనలలో ఎలాంటి నిజం లేదని తోసిపుచ్చారు. తన కొడుకును అన్యాయంగా టార్గెట్ చేస్తున్నందుకు నిరాశను వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌కు తెలియ ఒక్క సన్నివేశం కూడా లేదు అని స్పష్టం చేశారు. దీనిపై నటి మల్లికా సుకుమారన్ తన ఫేస్ బుక్ లో ఒక సుదీర్ఘ పోస్టును షేర్ చేశారు.
''మోహన్ లాల్ లేదా నిర్మాతలు పృథ్వీరాజ్ తమను మోసం చేశారని ఎప్పుడూ చెప్పలేదు. వారు ఎప్పటికీ అలా చేయరు. మోహన్ లాల్ నాకు తమ్ముడు లాంటి వారు. చాలా సందర్భాల్లో అతను నా కొడుకును ప్రశంసించారు. మోహన్ లాల్, నిర్మాతలకు తెలియకుండా కొంతమంది పృథ్వీరాజ్ ను బలిపశువును చేయడానికి ప్రయత్నించడం చూడటం హృదయ విదారకంగా ఉంది. దర్శకుడిగా, పృథ్వీరాజ్ ఈ సినిమాతో సంబంధం ఉన్న ఎవరినీ ఎప్పుడూ మోసం చేయలేదు, ఎప్పటికీ అలా చేయడు'' అని తెలిపారు.
Also Read: Cinema: మోహన్ లాల్ ఎంపురాన్ సినిమాపై బీజేపీ గుర్రు..సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్