O Yeong-su: ప్రముఖ కొరియన్ నటుడు ఓ యోంగ్ సు 'స్క్విడ్ గేమ్' సీరీస్ లో 001 ప్లేయర్ గా తన నటనతో ప్రపంచమంతటా గుర్తింపు పొందారు. అయితే 2022లో నటుడు యోంగ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఓ మహిళా ఆర్టిస్ట్ కేసు వేసింది. తాజాగా ఈ కేసుపై తుది విచారణ జరిపిన న్యాయస్థానం యోంగ్ కి సంవత్సరం జైలు శిక్ష విధించింది. 80 ఏళ్ళ వయసులో ఈ నటుడిపై లైంగిక వేధింపుల కేసులో చిక్కుకోవడం అభిమానులను షాక్ కి గురిచేసింది.
Squid Game actor, Oh Youngsoo, has been found guilty of sexual misconduct and will serve an 8 month suspended prison sentence. He will also serve 2 years of probation along with 40 hours of sexual violence education. pic.twitter.com/KSfO3MdSsl
— Dexerto (@Dexerto) March 15, 2024
ఏడాది జైలు శిక్ష
కోర్టు విచారణలో.. దాడి తర్వాత నుంచి పనికి వెళ్లాలంటేనే భయపడుతోందని బాధితురాలి తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. మరోవైపు యోంగ్ తాను ఒక తండ్రిలా ఆమె చేయి పెట్టుకున్నానని.. తాను చేసిన దానిలో ఏమాత్రం తప్పు లేదన్నట్లుగా సమర్థించుకున్నాడు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం సాక్ష్యాధారాలను పరిశీలించి అతడికి ఏడాది జైలు శిక్ష విధించింది.
గతంలో ఎనిమిది నెలల సస్పెండ్ జైలు శిక్ష..
అయితే 2017లో థియేటర్ ప్రదర్శన కోసం యోంగ్ ఓ ప్రదేశానికి వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు.. అక్కడ మహిళా నటిని ఇష్టానికి వ్యతిరేకంగా కౌగిలించుకొని, ముద్దుపెట్టుకున్నాడని 2022లో కేసు నమోదైంది. ఆ సమయంలో కోర్టు దీనిపై విచారణ జరిపిన కోర్టు .. ఓ యోంగ్ సుకు ఎనిమిది నెలల సస్పెండ్ జైలు శిక్ష విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించింది. కాగా, ఈ తీర్పుపై యోంగ్ కోర్టుకు అప్పీల్ చేసుకోగా.. తాజాగా తుది విచారణ జరిపి ఏడాది జైలు శిక్ష వేసింది.
telugu-news | cinema-news | o-yeong-su