అక్కా తమ్ముళ్ల బంధం ఎన్నటికీ వీడనిది.. విడదీయలేనిది. ఎన్ని గొడవలు జరిగినా.. తిరిగి మళ్లీ ఒక్కటి కావాల్సిందే. అదే మరోసారి నిజమైంది. మంచు ఫ్యామిలీలో గత కొన్నాళ్లుగా వివాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. నువ్వా నేనా అన్నట్లుగా మంచు ఫ్యామిలీ గొడవలు చెలరేగాయి. పోలీస్ స్టేషన్ వరకు చేరుకున్నాయి. అక్కడితో ఆగలేదు. ఆఖరికి కోర్టు మెట్లు కూడా ఎక్కారు.
Also Read : కల్యాణ్‌రామ్ ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ట్రైలర్ చూశారా? కెవ్ కేక
మంచు మోహన్ బాబు, మంచు విష్ణు ఒకవైపు- మంచు మనోజ్ మరోవైపు. సినిమాను తలపించేలా వీరి వివాదం నడిచింది. ఇప్పటికీ వీరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలు జరుగుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. ఆ మధ్య వీరు ఒకరినొకరు తిట్టుకుని.. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు. ఆ తర్వాత కొన్ని రోజులు కాస్త సైలెంట్ అయ్యారు.
Also Read : 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!
కానీ ఇప్పుడు మరోసారి మంచు ఫ్యామిలీలో చిచ్చు రాజుకుంది. మంచు మనోజ్ మరోసారి తీవ్రమైన ఆరోపణలు చేశాడు. తన కార్లను విష్ణు దొంగిలించాడంటూ తన తండ్రి మోహన్ బాబు ఇంటి ముందు ఆందోళనకు దిగాడు. కూతురి పుట్టినరోజు వేడుకల కోసం రాజస్థాన్ వెళ్లిన వెంటనే మంచు విష్ణు ఈ చోరీకి పాల్పడ్డాడని మనోజ్ ఆరోపణలు చేశాడు. ఇప్పుడు ఇదే రచ్చ కొనసాగుతోంది.
Also Read : ట్రెడిషనల్ లుక్ తో కట్టిపడేసిన మిల్కీబ్యూటీ..
ఇలా వరుస వివాదాలతో మంచు ఫ్యామిలీకి కంటి మీద కునుకు లేకుండా పోయింది. మంచు మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి ఈ వివాదాలపై నోరు విప్పేందుకు ఇష్టపడటం లేదు. అయితే మంచు లక్ష్మికి తమ్ముడు మనోజ్ మీదే ఎక్కువ ప్రేమ ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు నడుస్తున్నాయి. గతంలో ఆమె ముంబై నుంచి వచ్చి గొడవలను సరిచేయాలని చూసింది. కానీ ఆమె మాట ఎవరూ వినలేదని.. అక్కడ నుంచి వెంటనే మళ్లీ ఆమె వెళ్లిపోయిందని వార్తలు వినిపించాయి.
Also Read : 'సూర్య 45'లో మలయాళ బ్యూటీ అనఘా రవి
అక్కా తమ్ముళ్ల అనుబంధం
ఇదిలా ఉంటే తాజాగా మంచు లక్ష్మి, తమ్ముడు మంచు మనోజ్ కలిసారు. ‘టీచ్ ఫర్ ఛేంజ్’ అనే వార్షిక ఫండ్‌రైజర్ కార్యక్రమాన్ని మంచు లక్ష్మి ఏర్పాటు చేసింది. అందులో తన కూతురితో కలిసి ర్యాంప్ వాక్ చేసింది. అదే సమయంలో మంచు లక్ష్మి స్టేజ్ మీద ఉండగానే.. వెనుక నుంచి మంచు మనోజ్ దంపతులు సర్‌ప్రైజ్ చేశారు. దీంతో ఒక్కసారిగా తమ్ముడు మనోజ్‌ను చూసిన మంచు లక్ష్మీ మనసారా హత్తుకుని ఏడ్చేసింది. దీంతో పక్కనే ఉన్న మనోజ్ భర్య ఆమెను ఓదార్చింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది చూసి నెటిజన్లు.. అక్కా తమ్ముళ్ల అనుబంధం విడదీయలేనిది అంటూ కామెంట్లు పెడుతున్నారు.
(manchu-manoj | manchu lakshmi | manchu family | latest-telugu-news | telugu-news)