/rtv/media/media_files/2025/04/04/TjHQ6EfyQ3QiIfkZ8Ed0.jpg)
ACTOR RAVI KUMAR PASSED AWAY
Actor Ravi Kumar: ఈరోజు ఉదయం బాలీవుడ్ నటుడు మనోజ్ కుమార్ మరణ వార్త సినీ ప్రియులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇంతలోనే మలయాళ ఇండస్ట్రీలో మరో విషాదం చోటుచేసుకుంది. తమిళ్, మలయాళ చిత్రాలతో గుర్తింపు పొందిన ప్రముఖ నటుడు రవి కుమార్ కన్నుమూశారు. గతకొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో.. చైన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని నటుడు రవికుమార్ కొడుకు సోషల్ మీడియాలో ప్రకటించారు. రవికుమార్ మృతి పట్ల తమిళ్, మలయాళం సినీ ప్రముఖులంతా సంతాపం తెలియజేస్తున్నారు.
Also Read: Viral News: తల్లికి, బిడ్డకు ఒకేసారి కడుపు చేసిన యూట్యూబర్.. నెట్టింట ఫొటోస్ షేర్ చేయడంతో రచ్చ రచ్చ!
Deeply saddened to hear of #actor #ravikumars demise. Worked in Radaan for many projects in unforgettable roles.Made work place so memorable and a pleasure , was like an extended family to all on the seats, his laugh and deep voice will always be etched in our hearts. Will miss… pic.twitter.com/5TQ3s5skmM
— Radikaa Sarathkumar (@realradikaa) April 4, 2025
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్ కి బంపర్ న్యూస్.. SSMB29 రెండు పార్ట్స్ కాదు.. ఎన్నంటే!
1975లో ఇండస్ట్రీలోకి
కేరళలోని త్రిసూర్ లో జన్మించిన రవి కుమార్ 1975లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళం, తమిళ్లో అనేక చిత్రాల్లో నటించారు. మలయాళంలో ఉల్లాస యాత్ర’, ‘అవరగళ్’, ‘సీబీఐ 5’, ‘పరమానందం’ వంటి చిత్రాలతో బాగా గుర్తింపు పొందారు. అలాగే తమిళ్లో ఆనంద రాగం, అల్లాఉద్దీన్ అద్భుత విళక్కు సినిమాలు చేశారు.
telugu-news | cinema-news
ఇది కూడా చదవండి: Delhi Liquor Scam: కవిత అరెస్టుకు కారణాలేంటి? అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏంటి?