/rtv/media/media_files/2025/04/04/N7u9ko1LLK5c3QQ8qWjl.jpg)
Kancha Gachibowli Lands
Kancha Gachibowli Lands :హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలో ఉన్న కంచ గచ్చిబౌలి భూముల విషయంలో పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల రాకపోకలపై పూర్తి ఆంక్షలు విధిస్తూ పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
Also read; JD Vance: అమెరికా పౌరసత్వంపై జేడీ వాన్స్ సంచలన కామెంట్స్
హైదరాబాద్ శివార్లలో ఉన్న కంచ గచ్చిబౌలి భూములు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతం చుట్టూ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో తెలంగాణ పోలీస్ శాఖ ఎట్టకేలకు సీరియస్ అయింది. ప్రజల రాకపోకలపై పూర్తి ఆంక్షలు విధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ భూముల వద్దకు ఎవరూ రావొద్దని సూచనలు చేసింది. బయటి వ్యక్తులపై నిషేధం విధించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా సంబంధం లేని వ్యక్తులను ఆ భూముల్లోకి ఎంటర్ కానివ్వొద్దని స్థానిక పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా ఆంక్షలు అతిక్రమించి.. ప్రవేశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ భూములు అధికారుల పర్యవేక్షణలో ఉంది. పరిస్థితి ఉద్రిక్తతకు దారితీయకుండా ఉండేందుకు పోలీసులు ముందుగానే చర్యలు తీసుకుంటున్నారు. ఈ భూములకు సంబంధించి న్యాయపరమైన వివాదం కోర్టుల్లో ఉన్న నేపథ్యంలో.. ఎలాంటి అవాంఛిత పరిస్థితులు తలెత్తకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కంచె గచ్చిబౌలి రెవెన్యూ సర్వే నం.25లో గల 400 ఎకరాల భూమిపై ప్రస్తుతం రాద్ధాంతం నడుస్తోన్న విషయం తెలిసిందే.
ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సుప్రీంకోర్టు మండిపడింది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు, ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పనులను వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, అత్యవసరంగా చెట్లను నరికి వేయాల్సిన అవసరం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. దీనివల్ల పర్యావరణం పాడవుతుందనీ, అక్కడ నివసించే జంతుజాలం నాశనమవుతోందని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.
ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!