/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/grp.jpg)
Telangana Group 1 recruitment Line Clear
TG Group1: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఉద్యోగ నియామకాలకు లైన్ క్లియర్ అయింది. జీవో నెం.29ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టేందుకు టీజీపీఎస్సీ సన్నాహకాలు మొదలుపెట్టింది.
బలమైన వాదన కాదంటూ..
ఈ మేరకు మొత్తం 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకోసం 2024 ఫిబ్రవరిలో టీజీపీఎస్సీ(TGPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్, 2025లో ప్రిలిమినరీ పరీక్ష జరగగా అక్టోబర్ లో మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు 2025, మార్చి 10న ప్రకటించారు. మార్చి 30న జనరల్ ర్యాంక్స్ విడుదల చేశారు. కానీ ఈ నోటిఫికేషన్ లో జీవో నెం.29 ద్వారా తమకు అన్యాయం జరుగుతోందని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు వారి పిటిషన్‌ను కొట్టివేసింది. బలమైన వాదనలు లేవని తోచిపుచ్చింది.
Also read: Telangana : గ్రూప్-1 మెయిన్స్ టాపర్ ఈమెనే.. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే!
మరోవైపు.. తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామ్‌లో అవినీతి జరిగిందని అశోక్ సార్ ఆరోపించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్‌లో దొంగలు పడ్డారని షాకింగ్ విషయాలు ఆయన వెల్లడించారు. 563లో సగానిపైగా ఉద్యోగాలు అమ్ముకున్నారని చెబుతున్నారు. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ ఎగ్జామ్ జనరల్ ర్యాకింగ్ ఫలితాలు మార్చి 30న విడుదల చేశారు. అయితే అందులో టాప్ 100 ర్యాంకుల్లో 44 శాతం ఓసీలే ఉన్నారని అశోక్ సార్ వివరించారు. గ్రూప్ 1లో దొంగల ర్యాజం నడుస్తోందని అన్నారు. డబ్బు ఉన్నోలకు మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని అశోక్ సార్ ఆరోపిస్తున్నారు. అసలు దొంగలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ మాజీ ఛైర్మన్ మహేందర్ రెడ్లే అని ఆయన అన్నారు. EWS రిజర్వేషన్ పేరిట అన్ని ఉద్యోగాలు రెడ్లకే దోచిపెట్టారని అశోక్ సార్ అంటున్నారు.
Also read: ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం.. కాకనాడ పోర్టుకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
: tgpsc | group-1 | supremecourt | telugu-news | today telugu news