BIG BREAKING: వల్లభనేని వంశీకి మరో ఎదురు దెబ్బ.. హైకోర్టు బిగ్ షాక్!
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.
టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ధర్మాసనం తిరస్కరించింది.
వైఎస్ జగన్ తాజాగా కారాగారంలో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వంశీ రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టే అతడిని టార్గెట్ చేశారని అన్నారు. చంద్రబాబు, లోకేష్ కంటే వంశీ గ్లామరస్‌గా ఉంటాడని.. అందుకే వారికి కోపం అని చెప్పుకొచ్చారు.
దోమల బెడద నివారణ కోసం పెట్టిన దోమలచక్రం కొంపముంచింది. చక్రానికి ఉన్న నిప్పు పరుపులకు అంటుకొని అనాథాశ్రమంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన గన్నవరం శివారులోని రీచ్ విద్యా సంస్థల ప్రాంగణంలోని లిటిల్ లైట్స్ హోమ్‌లో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 6గురికి గాయాలయ్యాయి.
ఏపీలో పలు యూనివర్సిటీలకు వీసీలను నియమిస్తూ గవర్నర్ ఉత్తర్వులు జారీ చేశారు. JNTU కాకినాడ యూనివర్సిటీ వీసీగా సీఎస్ఆర్కే ప్రసాద్, ఆంధ్రా యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజశేఖర్, యోగి వేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ప్రొఫెసర్ ప్రకాశ్ బాబు నియమితులయ్యారు.
వల్లభనేని వంశీకి నిన్న ఉదయం జైలులో ఫిట్స్ వచ్చాయని ఆయన సతీమణి పంకజశ్రీ తెలిపారు. గదిలో ఎవరూ లేకపోవడంతో వంశీకి సహాయం లభించలేదన్నారు. ఈ రోజు వంశీని కలిసిన తర్వాత RTVతో ఆమె మాట్లాడారు. వంశీ ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగానే ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్లకాలం టీడీపీ ప్రభుత్వమే అధికారంలోకి ఉండదని మాజీ సీఎం జగన్ అన్నారు. ఇష్టానుసారం ప్రవర్తిస్తున్న పోలీసులను ఎక్కడ ఉన్నా తీసుకువచ్చి బట్టలు ఊడదీసి నిలబెడతామన్నారు. విజయవాడ జైలులో వైసీపీ నేత వల్లభనేని వంశీని పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడారు.
తలసేమియా బాధితుల కోసం విజయవాడలో ఈరోజు ఎన్టీయార్ ట్రస్ట్ యుఫోరియాతో తమన్ మ్యూజిక్ కన్సర్ట్ నిర్వహించింది. దీనికి సీఎం చంద్రబాబు ఫ్యామిలీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బాలకృష్ణలు హాజరయ్యారు. ఎన్టీయార్ ట్రస్ట్, బసవతారకం ఆసుపత్రులు చేస్తున్న సేవని కొనియాడారు.
వల్లభనేని వంశీ అరెస్ట్ పై మంత్రి నారా లోకేష్ స్పందించారు. దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకు వంశీ జైలుకు వెళ్లాడన్నారు. తప్పు చేసిన వైసీపీ నేతలందరినీ చట్ట ప్రకారం శిక్షిస్తామని స్పష్టం చేశారు. వంశీపై కూడా చట్ట ప్రకారం చర్యలు ఉంటాయన్నారు.
సూర్యాపేట సమీపంలో జరగనున్న దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర సందర్భంగా ఈ నెల 16 నుంచి 20 వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని పోలీసులు తెలిపారు. హైదరాబాద్-విజయవాడ, ఖమ్మం, కోదాడ మధ్య దారి మళ్లింపు ఉంటుందని పోలీసులు వెల్లడించారు. పూర్తి వివరాలు ఈ ఆర్టికల్‌లో..