YS Jagan: వంశీ చాలా అందగాడు.. అందుకే చంద్రబాబుకు కోపం: జగన్!

వైఎస్ జగన్‌ తాజాగా కారాగారంలో ఉన్న వల్లభనేని వంశీని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వంశీ రాజకీయంగా ఎదుగుతున్నాడు కాబట్టే అతడిని టార్గెట్ చేశారని అన్నారు. చంద్రబాబు, లోకేష్‌ కంటే వంశీ గ్లామరస్‌గా ఉంటాడని.. అందుకే వారికి కోపం అని చెప్పుకొచ్చారు.

New Update
ap former cm ys jagan strange comments on cm chandra babu

ap former cm ys jagan strange comments on cm chandra babu

వైసీపీ నేత వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ని ఇటీవల పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది. విజయవాడ (Vijayawada) లోని జిల్లా కారాగారంలో ఆయన్ను ఉంచారు. ఈ క్రమంలో వంశీని పరామర్శించేందుకు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా విజయవాడ చేరుకున్నారు. వంశీని పరామర్శించిన అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. 

Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!

కూటమి ప్రభుత్వం వంశీని టార్గెట్ చేసిందని.. అయితే అలా టార్గెట్ చేయడం వెనుకున్న అసలు కారణం అతడు చంద్రబాబు సామాజికవర్గానికి చెందిన వాడని అన్నారు. అందువల్లనే వంశీ రాజకీయంగా ఎదుగుతుండటం చూడలేకపోతున్నారని ఆయన విమర్శించారు. తన సామాజికవర్గంలోనే ఒక మనిషి ఎదుగుతున్నాడంటే చంద్రబాబు తట్టుకోలేరని ఆరోపించారు. 

Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే  నో రిఫండ్‌.. ఐటీ శాఖ ఏమందంటే!

వంశీ గ్లామరస్‌గా ఉంటాడు

అందుకే కొడాలి నానిని చూసినా ఆయన జీర్ణించుకోలేరని పేర్కొన్నారు. అలాగే చంద్రబాబు, లోకేష్‌ కంటే వంశీ గ్లామరస్‌గా ఉంటాడని అన్నారు. అందువల్లనే వీరిద్దరంటే చంద్రబాబుకు బాగా కోపం అని జగన్ (YS Jagan) చెప్పుకొచ్చారు. అయితే వీరిద్దరు మాత్రమే కాదని.. వీరితో పాటు దేవినేని అవినాష్ కూడా చక్కగా ఉంటాడని.. అతడు కూడా ఎప్పుడో టార్గెట్ అవుతాడని తెలిపారు. 

Also Read: Anand Mahindra: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

అనుకూలంగా లేకపోతే గెటౌట్

చంద్రబాబు, లోకేష్‌ మాత్రమే తమ సామాజికవర్గంలో నాయకులని.. వారికి అనుకూలంగా లేకపోతే మాత్రం అక్కడి నుంచి వెలేస్తుంటారని విమర్శించారు. ఇక వంశీ, నాని, శంకరరావు, అవినాష్, బ్రహ్మనాయుడు సహా మరెందరో చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడితే.. వారిపై విమర్శలు చేయిస్తారని ఆరోపించారు.

ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరోవైపు వైఎస్ జగన్ మరికొద్ది సేపట్లో గుంటూరు మిర్చి యార్డుకు బయల్దేరనున్నారు.  పెట్టిన పెట్టుబడికి సరైన గిట్టుబాటు ధరలు లేక మిర్చి రైతులు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ తరుణంలో జగన్ వారి సమస్యలు తెలుసుకోవడానికి ఇవాళ గుంటూరు పయణమయ్యారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు