/rtv/media/media_files/2025/02/11/8ZVP2gwxVAOZyM8Ve6HW.jpg)
Hyderabad-Vijayawada High Way
తెలంగాణ (Telangana) లో మేడారం తర్వాత రెండో అతిపెద్ద జాతర అయిన దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర (Peddagattu Jatara) రేపు అంటే.. ఈ నెల 16వ దేదీ నుంచి ప్రారంభం కానుంది. అప్పటి నుంచి 20వ తేదీ వరకు జాతర కొనసాగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక ప్రకటన చేశారు. జాతర నేపథ్యంలో విజయవాడ-హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగించే NH-65 పై వాహనాల దారి మళ్లింపు ఉంటుందని తెలిపారు. 16వ తేదీ ఉదయం నుంచే వాహనాల మళ్లింపు ఆంక్షలు ఉంటాయని వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
ఇది కూడా చదవండి: వాళ్లు అప్లై చేసుకోవద్దు.. కొత్త రేషన్ కార్డు అప్లికేషన్లపై బిగ్ ట్విస్ట్!
మళ్ళింపు (1) నార్కట్ పల్లి వద్ద:
హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్ళు వాహనాలను నార్కట్ పల్లి వద్ద మళ్లించి నల్గొండ వైపు గా మిర్యాలగూడ, హుజూర్నగర్, కోదాడ మీదుగా విజయవాడ కు పంపిస్తారు.
మళ్ళింపు (2) కోదాడ వద్ద:
విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలను కోదాడ వద్ద మళ్లించి హుజూర్నగర్, నేరేడుచర్ల, మిర్యాలగూడ, నల్గొండ, నార్కట్ పల్లి మీదుగా హైదరాబాద్ కు..
మళ్ళింపు (3):
హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లే వాహనాలను టేకుమట్ల వద్ద జాతీయరహదారి 365 BB మీదుగా మళ్లిస్తారు.
ఇది కూడా చదవండి: Ramarajyam Raghav Reddy : రామరాజ్యం రాఘవరెడ్డి నెక్ట్స్ టార్గెట్ చిన్నజీయర్ స్వామినా? వీడియోలు వైరల్
— SP SURYAPET (@spsuryapet) February 11, 2025
Also Read : నేను కొందరికి నచ్చకపోవచ్చు.. ఢిల్లీలో రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సూర్యాపేట-కోదాడ వెళ్లే వాహనాల మళ్ళింపు:
కోదాడ, మునగాల, గుంపుల మీదుగా సూర్యాపేట పట్టణానికి వచ్చే RTC బస్సులు, ఇతర చిన్న ప్రజా రవాణా వాహనాలను SRSP కెనాల్ నుంచి బీబీగుడెం వద్ద నుండి సూర్యాపేట పట్టణానికి పంపిస్తారు. సూర్యాపేట పట్టణం నుంచి కోదాడ వెళ్లే RTC బస్సులు, ప్రజా రవాణా వాహనాలు కుడ కుడ గ్రామం మీదుగా ఐలాపురం వద్ద ఖమ్మం జాతీయరహదారి మీదుగా రాఘవపురం స్టేజి నుంచి నామవరం గ్రామం మీదుగా జాతీయ రహదారి 65 పై గుంజలూరు స్టేజి వరకు మళ్లించి కోదాడ, విజయవాడ వైపునకు పంపిస్తారు.
Also Read : వంశీని వదిలిపెట్టం.. అరెస్ట్ పై లోకేష్ ఫస్ట్ రియాక్షన్!
దురాజుపల్లి పెద్దగట్టు జాతర పోలీసు బందోబస్తు ఏర్పాట్లు. 2000 మంది పోలీసులతో బందోబస్తుతో పటిష్ట భద్రత. 68 సీసీ కెమెరాలు ఏర్పాటు, నిరంతర నిఘా. దొంగతనాల నివారణకు స్పెషల్ టీమ్స్. మహిళల రక్షణకు షీ టీమ్స్ సిబ్బంది. జాతర ప్రాంగణంలో బెట్టింగ్ లు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చర్యలు. pic.twitter.com/Ul5PzdQ77U
— SP SURYAPET (@spsuryapet) February 12, 2025
KTR : మోసగాడిని నమ్మినందుకు తెలంగాణ ఆగం అయింది. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు
BRS meeting
KTR : తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి లాంటి మోసపూరిత నేతను నమ్మిన ఫలితంగా తీవ్రంగా మోసపోయారని, రాష్ట్రానికి చివరికి చేతిలో మిగిలింది చిప్పే అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మల్కాజిగిరిలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు..రేవంత్ రెడ్డి చెప్పిన అవాస్తవ వాగ్దానాలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అసంబద్ధ హామీల వలన ప్రజల జీవితాలు సంక్షోభంలో పడినట్టు పేర్కొన్నారు. ‘‘ఒక్కసారి మోసపోతే అది మోసగాడి తప్పు, కానీ పదేపదే మోసపోతే అది మన తప్పవుతుంది. కాబట్టి ఈసారి ఎలాంటి ఎన్నిక వచ్చినా కాంగ్రెస్‌ను తిప్పికొట్టాలి’’ అని ప్రజలను హెచ్చరించారు.
ఇది కూడా చూడండి: BRS: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి మంజూరు..!
కాంగ్రెస్ ను తిరస్కరించండి
‘ఒకే తప్పును మళ్లీ చేయొద్దు. GHMCతో పాటు రానున్న అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్‌ను తిరస్కరించండి’’ అంటూ కేటీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాష్ట్రం మొత్తం దారుణంగా వెనుకబడుతున్నా, ఒక్క రేవంత్ రెడ్డీయే ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ‘‘రేవంత్ పాలన వలన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలే అసంతృప్తిగా ఉన్నారు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనవసరం లేదు. ఇది వాళ్ల విఫల పాలన ఫలితమే’’ అని అన్నారు.
మల్కాజిగిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ప్రజల మధ్య తిరుగుతూ సమస్యల పరిష్కారానికి నిరంతర కృషి చేస్తారని కేటీఆర్ ప్రశంసించారు. ‘‘డంపింగ్ యార్డ్ వంటి కీలక సమస్యలపై పోరాడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంచి నాయకుడిని గెలిపిస్తే, మంచి మార్పు సాధ్యమవుతుందని ఆయన నిరూపించారన్నారు.
Also Read: సుంకాలు 90 రోజుల విరామం ఎఫెక్ట్.. భారీ లాభాల్లో భారత స్టాక్ మార్కెట్లు..
నలుగురికి భరోసానిచ్చేది బీఆర్ఎస్
ఎన్నిక ఏదైనా, సందర్భం ఏదైనా ఈసారి ప్రజలు కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఆత్మ, తెలంగాణ స్వభిమానం కాపాడాలంటే, భరోసా నలుగురికీ కలిగించగల పార్టీ ఒక్కటే ఉంది అది భారత రాష్ట్ర సమితి అని పేర్కొన్నారు.సిల్వర్ జూబ్లీ ఉత్సవాల విజయవంతానికి కేటీఆర్ పిలుపునిచ్చారు. ‘‘ఈ నెల 27న పార్టీ సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం. ఒక పార్టీగా 25 సంవత్సరాల ప్రయాణం ఎలాంటి మైలురాయో ప్రతి కార్యకర్తకు అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో రెండవ ఘనత సాధించిన పార్టీగా మనకు గర్వం’’ అని కేటీఆర్ తెలిపారు.ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీలకు చెందిన పలువురు నేతలు కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.
Also Read: హెచ్ 1బీ వీసా, గ్రీన్ కార్డ్..నిత్యం ఉంచుకోవాల్సిందే..వలసదారులకు స్ట్రిక్ట్ రూల్స్
DC VS MI: ఢిల్లీకి బ్రేక్ పడింది..ఉత్కంఠ మ్యాచ్ లో గెలిచిన ముంబయ్
DRDO: భారత అమ్ములపోదిలో మరో అస్త్రం..లేజర్ వెపన్
Tirupati Venkateswara Swamy Temple : శ్రీవారికి తలనీలాలు సమర్పించిన పవన్ భార్య
DC vs MI: ఢిల్లీ క్యాపిటల్స్ ముందు భారీ లక్ష్యం.. మంబయి స్కోర్ ఎంతంటే ?
AB Venkateswara Rao : జగన్ అంటే హత్యలు, అవినీతి, అరాచకం...మాజీ ఇంటిలిజెంట్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు