/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Vallabhaneni-Vamsi-Arrest-.jpg)
మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టు లో పెద్ద షాకే తగిలింది గన్నవరం టీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో వంశీకి బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం తిరస్కరించింది. ముందుస్తు బెయిల్ కోరుతూ వంశీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టేసింది.
Also Read: America: పనామా హోటల్ లో 300 మంది భారతీయులు సాయం కోసం కేకలు!
ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచించింది. ఇదే కేసులో గతంలో 36 మందికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఆ తరువాత వారంతా విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించారు. అక్కడ కూడా ఈ 36 మందికి ఎదురుదెబ్బే తగిలింది. వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు ఎస్సీ, ఎస్టీ కోర్టు కూడా నిరాకరించింది. తాజాగా వంశీకి కూడా ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టుకు నిరాకరించేందుకు తదుపరి చర్యలకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
సీన్ రీకన్‌స్ట్రక్షన్...
కాగా.. ప్రస్తుతం జైలులో ఉన్న వంశీని పదిరోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ పై బుధవారం ఎస్సీ, ఎస్టీ కోర్టులో విచారణ జరిగింది. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కస్టడీలో విచారించాల్సిన అవసరం ఉందని.. సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయాల్సి ఉందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో 11 మంది నిందితులు ఉన్నారని.. వారిలో ఐదుగురు మాత్రమే అరెస్ట్ అయ్యారని, మరో ఆరుగురిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు.
అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్ అవసరం లేదని వంశీ తరపు లాయర్ వాదించారు. సత్యవర్ధన్ బయటే ఉన్నందున అతడిని విచారిస్తే సరిపోతుందని ఆయన అన్నారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తదుపరి విచారణను నేటికి వాయిదా వేసింది.
Also Read: Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు!