/rtv/media/media_files/2025/02/19/Uun92cSbeCH9pglpeYbc.jpg)
Krishna District Fire Accident in Gannavaram Orphanage
సాధారణంగా దోమల బెడద నివారణకు చాలా మంది గుడ్ నైట్ (Good Knight), ఆల్ అవుట్ క్వాయిల్స్ (All Out Coils) వాడుతారు. దోమలు బాగా కరిచేస్తున్నాయ్ అంటూ నిప్పంటించిన క్వాయిల్‌ను పక్కనే పెట్టుకుంటారు. అలా చేసి ఇబ్బందుల్లో పడతారు. తాజాగా ఓ విద్యార్థి అలా చేసి ఏకంగా స్కూల్ గదిలోనే మంటలు తెప్పించాడు. దోమలు ఎక్కువగా ఉన్నాయని.. క్వాయిల్ ముట్టించాడు.
Also Read: Horoscope Today: నేడు ఈ రాశి వారికి వాహన ప్రమాదాలు జరిగే సూచనలున్నాయి... జాగ్రత్త!
దాన్ని తన పక్కనే పెట్టుకున్నాడు. ఇక ఫ్యాన్ గాలికి అది ఇంకాస్త మంట వ్యాపించి పరుపుకు అంటుకుంది. దీంతో ఆ గది మొత్తం మంటలు వ్యాపించాయి. అందులోంచి పలువురు బయటకు వచ్చేయగా.. ఇంకొందరు అందులోనే చిక్కుకున్నారు. అనంతరం ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పి మిగతావారిని బయటకు తీశారు. ఈ ఘటన గన్నవరం శివారులోని లిటిల్ లైట్స్ హోమ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Also Read: IT Refunds: రిటర్నులు ఆలస్యమయ్యాయా..అయితే నో రిఫండ్.. ఐటీ శాఖ ఏమందంటే!
ఒకే గదిలో 70 మంది
గన్నవరం శివారులోని రీచ్ విద్యా సంస్థల ప్రాంగనంలోని లిటిల్ లైట్స్ హోమ్‌లో (Gannavaram Orphanage) దాదాపు 140 మంది విద్యార్థులు ఉంటున్నారు. వీరంతా మూడో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు చదువుతున్న వారు. వీరిలో 70 మంది విద్యార్థులున్న గదిలో ఓ స్టూడెంట్ దోమల చక్ర నివారణకు క్వాయిల్ వెలిగించాడు. దాన్ని తన పరువు పక్కనే పెట్టుకున్నాడు.
Also Read: Anand Mahindra: భారత్ లో టెస్లా..ఆనంద్ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!
అది కాస్త సీలింగ్ ఫ్యాన్ గాలికి పక్కనే ఉన్న పరుపుకు అంటుకుంది. దీంతో క్షణాల వ్యవధిలో మంటలు వ్యాపించాయి. అందులోనూ ఫ్యాన్ గాలికి గది అంతా పొగ నిండిపోయింది. విద్యా్ర్థులు కేకలు వేస్తూ పొగతో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరయ్యారు. అక్కడ నుంచి కొందరు బయటకు పరుగులు తీశారు.
అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే ఫైర్ సిబ్బందికి ఫోన్ చేశారు. అనంతరం సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పి లోపల ఉన్న 28 మందిని బయటకు తీశారు. ఈ ప్రమాదంలో విద్యార్థులు సిద్ధార్థ్, అఖిల్, ఉదయ్ కిరణ్, అఖిలేష్, వినయ్, తేజేశ్వర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని హాస్పిటల్‌కు తరలించారు.