/rtv/media/media_files/2025/02/18/hY4oNqrIhnpVWRz61lZd.jpg)
Vallabhaneni Vamshi
జగన్ పరామర్శతో వల్లభనేని వంశీకి భరోసా లభించిందని ఆయన సతీమణి పంకజశ్రీ అన్నారు. తమకు పూర్తిగా అండగా ఉంటమని జగన్ భరోసా ఇచ్చారన్నారు. న్యాయపరంగా అన్ని ఏర్పాట్లు తాను చూసుకుంటానని వంశీకి జగన్ చెప్పారన్నారు. వంశీ హెల్త్ కండిషన్ ఇబ్బందికరంగానే ఉందన్నారు. నిన్న ఉదయం వంశీకి ఫిట్స్ వచ్చాయన్నారు. ఆ గదిలో ఎవరూ లేకపోవడం వల్ల ఎవరూ సహాయం చేయలేకపోయారన్నారు. వంశీకి తోడుగా ఎవరినైనా ఉంచాలని అధికారులను కోరారు. సోషల్ మీడియాలో తమ కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పోస్టులు పెట్టే వారిపై ప్రైవేట్ కేసులు వేస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: నాకు రోజుకో అమ్మాయి.. ఇప్పటికే 400 మందితో.. కిరణ్ రాయల్ సంచలన ఆడియో!
నిన్న మా ఆయనకి జైల్లో ఫిట్స్ వచ్చాయి..
— RTV (@RTVnewsnetwork) February 18, 2025
అరిచినా ఎవరూ పట్టించుకోలేదట ..
దయచేసి ఆయనను ఇబ్బంది పెట్టకండి..
RTV తో వల్లభనేని వంశీ భార్య పంకజ శ్రీ...#VallabhaneniVamsiarrest #TDP #YSRCongressParty #RTV pic.twitter.com/ddKL536Gd7
పోలీసులు ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఏపీ మాజీ సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విజయవాడ జైలులో వల్లభనేని వంశీని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లకాలం టీడీపీ(TDP) ప్రభుత్వమే అధికారంలో ఉండదన్నారు. అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతామని వార్నింగ్ ఇచ్చారు.
ఎక్కడ ఉన్నా తీసుకువస్తామని స్పష్టం చేశారు జగన్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ చోటా వీళ్లే కేసులు పెడుతున్నారు.. వీళ్లే బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తన సామాజిక వర్గం నుంచి ఎదుగుతున్నాడనే చంద్రబాబుకు వంశీపై కోపమన్నారు.
ఇది కూడా చదవండి: Vizag Lorry Incident: విశాఖలో లారీ భీభత్సం.. పార్కులోకి దూసుకెళ్లడంతో..
ఎదురు తిరిగి మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టడం.. ఇబ్బందులు పెట్టడం.. లోకేష్ నైజమన్నారు. పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు. ఓ పథకం ప్రకారం ఇదంతా చేశారని ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ ను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు జగన్. రాష్ట్రంలో టీడీపీకి నచ్చని వాళ్ళపై కేసులు పెట్టిస్తున్నారన్నారు.