/rtv/media/media_files/2025/02/18/BerB3yuLubjTLQZZy30m.jpg)
YS Jagan Warning To AP police Over Vallabhaneni Vamshi Arrest
YS Jagan VS Police: పోలీసులను ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారని ఏపీ మాజీ సీఎం జగన్ (YS Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు విజయవాడ(Vijayawada) జైలులో వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) ని పరామర్శించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎల్లకాలం టీడీపీ(TDP) ప్రభుత్వమే అధికారంలో ఉండదన్నారు. అన్యాయాలు చేసిన వారిని బట్టలూడదీసి నిలబెడతామన్నారు. ఎక్కడ ఉన్నా తీసుకువస్తామని స్పష్టం చేశారు జగన్. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూలిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీ చోటా వీళ్లే కేసులు పెడుతున్నారు.. వీళ్లే బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు.
Also Read: సీఈసీగా జ్ఞానేష్ వద్దు.. కాంగ్రెస్ అభ్యంతరం చెప్పడానికి కారణం ఇదే?
The Vintage @ysjagan 🔥😎
— 𝓡𝓪𝓿𝓪𝓵𝓲 𝓙𝓪𝓰𝓪𝓷 || రావాలి జగన్ (@RavaliJagan) February 18, 2025
pic.twitter.com/tyXLWQ90NW
Also Read: మెదక్ జిల్లాలో దారుణం .. తల్లి అక్రమసంబంధం కొడుకులకు తెలియడంతో
ఎదుగుతున్నాడనే వంశీంపై ఆక్రోషం..
వంశీని తన సామాజిక వర్గం నుంచి ఎదుగుతున్నాడని చంద్రబాబుకు ఆక్రోశమన్నారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి వంశీ చాలా చేశారన్నారు. ఎదురు తిరిగి మాట్లాడితే తప్పుడు కేసులు పెట్టడం.. ఇబ్బందులు పెట్టడం.. లోకేష్ నైజమన్నారు. పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు. ఓ పథకం ప్రకారం ఇదంతా చేశారని ఫైర్ అయ్యారు. లా అండ్ ఆర్డర్ ను తప్పుదోవ పట్టించారని ధ్వజమెత్తారు జగన్. రాష్ట్రంలో టీడీపీకి నచ్చని వాళ్ళపై కేసులు పెట్టిస్తున్నారన్నారు.
Also Read: విశాఖలో లారీ భీభత్సము.. పార్కులోకి దూసుకెళ్లడంతో..
Also Read: దారిలో మొసళ్లు, పాములు.. అక్రమంగా అమెరికా ఇలా వెళ్లాను.. పంజాబ్ వ్యక్తి కన్నీటి కథ!
నెలలకు నెలలు జైలులో పెట్టించేలా కుట్రలు చేస్తున్నారన్నారు. పిడుగురాళ్ల మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు చేశారని ఆరోపించారు. ఒక్క సభ్యుడు లేకపోయినా వైస్ చైర్మన్ పదవి గెలుచుకున్నాం అని సిగ్గులేకుండా చెప్పుకుంటున్నారన్నారు. తిరుపతిలో కూడా అదే పద్ధతిలో చేశారన్నారు. బస్సుల్లో వెళ్తున్న వారిని కిడ్నాపులు చేశారన్నారు. తునిలో 30 కి 30 వైసీపీ గెలిచిందన్నారు. వైసీపీ వాళ్లను దౌర్జన్యం చేసే అవకాశం లేకపోతే ఎన్నికలు వాయిదా వేస్తున్నారన్నారు.