/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/allu-jpg.webp)
Allu Arjun and Shah Rukh Khan on Twitter: షారూఖ్ ఖాన్...బాలీవుడ్ కీ బాద్షా. ఇతనిని ఢీకొట్టే మరో హీరో లేడు అక్కడ ఇంతవరకు. అలాగే అల్లు అర్జున్...తాజాగా వచ్చిన నేషనల్ అవార్డ్ తో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు. పాన్ ఇండియా హీరోగా ఎదిగి...వరల్డ్ వైడ్ గా కూడా స్టార్ డమ్ సంపాదించుకుంటున్నాడు. అలాంటి వీరిద్దరూ మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది. అది కూడా మీ సినిమా బావుందని ఒకరు అంటే అయ్యో మిమ్మల్ని చూసి ఎంతో నేర్చుకున్నాని మరొకరు చెప్పుకుంటూ ఉంటే మజా వస్తుంది కదూ. సరిగ్గా అదే జరిగింది. తాజాగా రిలీజ్ అయిన షారూఖ్ ఖాన్ సినిమా మీద అల్లు అర్జున్ ప్రశంసల వర్షం కురిపించాడు. మొత్తం సినిమా యూనిట్ ను అభినందిస్తూ ట్వీట్ చేశాడు బన్నీ. అందులో బాద్షా గురించి ప్రత్యేకంగా చెబుతూ...మీ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమా...మీ స్టైల్ తో మొత్తం ఇండియానే షేక్ చేశారు. మిమ్మల్ని ఇలా చూడ్డం ఆనందంగా ఉంది అంటూ రాసుకొచ్చాడు. అలాగే విజయ్ సేతుపతి , దీపిక, నయనతార ల గురించి కూడా మెన్షన్ చేశాడు.
Biggg Congratulations to the whole team of #JAWAN for this mammoth blockbuster . Warm regards to the entire cast , technicians, crew & producers of #JAWAN @iamsrk garu’s Massiest avatar ever , charming the whole of India & beyond with his swag . Truly happy for you sir , we…
— Allu Arjun (@alluarjun) September 14, 2023
అల్లు అర్జున్ ట్వీట్ లకు బాలీవుడ్ బాద్షా షారూఖ్ కూడా రీట్వీట్ పెట్టారు. బన్నీ మాటలకు చెప్పలేనంత ఆనందంగా ఉందని అన్నారు షారూఖ్. మీ ట్వీట్ తో జవాన్ విజయాన్ని మళ్ళీ ఆస్వాదిస్తున్నాని అన్నారు. అంతేకాదు మీ పుష్ప సినిమాను మూడు సార్లు చూశానని, మీ నుంచి ఎంతో నేర్చుకున్నాని రాసుకొచ్చారు కింగ్ ఖాన్. త్వరలోనే మిమ్మల్ని కలిసి నా ప్రేమను తెలియజేస్తాను అన్నారు.
Thank u so much my man. So kind of you for the love and prayers. And when it comes to swag and ‘The Fire’ himself praises me….wow…it has made my day!!! Feeling Jawan twice all over now!!! I must admit I must have learnt something from you as I had seen Pushpa thrice in three… https://t.co/KEH9FAguKs
— Shah Rukh Khan (@iamsrk) September 14, 2023
మరోవైపు బన్నీ ట్వీట్ కు మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ కూడా రీట్వీట్ చేశాడు. దానికి అల్లు అర్జున్ సరదాగా థాంక్స్ చెబితే సరిపోతు...న నా సినిమాకు మంచి పాటలు ఇవ్వాలంటూ రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఎక్స్ లో వీరి చిట్ చాట్ అంతా ట్రెండింగ్ లో ఉంది. ఇద్దరు పెద్ద హీరోలు ఇంత హంబుల్ గా మాట్లాడుకోవడం వైరల్ అవుతోంది.
Also Read: గుంటూరు కారం.. మరో డిసప్పాయింట్ మెంట్