world cup: హైదరాబాద్ లో పాక్ క్రికెటర్ల సందడి...కట్టుదిట్టమైన భద్రత

ఏడేళ్ళ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ జట్టు భారత్ లోకి అడుగు పెట్టింది. వరల్డ్ కప్ టోర్నీలో ఆడేందుకు వచ్చిన పాక్ క్రికెటర్లు హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈరోజు వీరు న్యూజిలాండ్ తో మొదటి వార్మప్ మ్యాచ్ ఆడనున్నారు.

New Update
world cup: హైదరాబాద్ లో పాక్ క్రికెటర్ల సందడి...కట్టుదిట్టమైన భద్రత

వన్డే వరల్డ్ కప్ సందడి హైదరాబాద్ కి కూడా వచ్చేసింది. ఒకపక్క గణేష్ నిమజ్జనం, మరో వైపు పాక్, న్యూజిలాండ్ క్రికెటర్లతో హైదరాబాద్ హడావుడిగా మారిపోయింది. ఏడేళ్ళ తర్వాత ఇండియాకు వచ్చిన పాక్ క్రికెటర్లకు ఇక్కడ ఘన స్వాగతం లబించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భద్రతా సిబ్బంది, ప్రయాణికులు జట్టుకు చేతులూపుతూ స్వాగతం పలికారు. స్థానికులు కొంతమంది పాక్ క్రికెటర్లను చూడ్డానికి ఎయిర్ పోర్ట్ కి కూడా వచ్చారు. బాబర్ ఆజమ్ అంటూ నినాదాలు చేశారు.

విమానాశ్రయం నుంచి పార్క్ హయత్ చేరుకున్న పాక్ జట్టుకు హోటల్ దగ్గర కూడా ఘన స్వాగతం లభించింది. ఏడేళ్ళ తర్వాత దాయాది జట్టు భారత్ కు రావడం అందరిలోనూ ఉత్సాహాన్ని నిలుపుతుంది. దీన్ని భారత్-పాక్ ల మ్యాచ్ కు ఎంతటి క్రేజ్ ఉంటుందో మనం ఊహించుకోవచ్చును. పాక్ జట్టు ఈరోజు ఉప్పల్ స్టేడియంలో న్యూజిలాంగ్ తో తలపడనుంది. న్యూజిలాండ్ జట్టు నిన్ననే హైదరాబాద్ చేరుకుంది. ఈ టీమ్ బేగంపేట్ లోని ఐటీసీ కాకతీయలో బస చేసింది. ఇరు జట్లకు ఇదే మొదటి వార్మప్ మ్యాచ్.

ఈరోజు గణేష్ శోభాయాత్ర, మిలాద్ ఉన్ నబీ దృష్ట్యా హైదరాబాద్ లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. క్రికెటర్లకు కూడా భారీ భద్రత ఉండేలా చూస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా పాక్-న్యూజిలాండ్ మధ్య జరిగే వార్మప్ మ్యాచ్ కు కూడా ప్రేక్షకులను అనుమతించడం లేదు. కానీ ఈ ఒక్క రోజే ఈ నింబంధన వర్తిస్తుంది. అక్టోబర్ 3న జరిగే వార్మస్ మ్యాచ్ కు క్రికెట్ అబిమానులను అనుమతిస్తున్నారు. మరోవైపు పాకిస్తాన్ జిందాబాద్ అంటూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. పోలీసులు అతడిని అదుపులోకి విచారించగా...ఊరకనే సరదాగా చేశానని చెప్పాడు.వరల్డ్ కప్ లో అక్టోబర్ 6, 9, 10 తేదీల్లో మ్యాచ్ లు ఉప్పల్ స్టేడియంలో జరగనుంది. బుక్ మై షోలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చును.

ఇక తమ టీమ్ వరల్డ్ కప్ లో బాగా రాణిస్తుందని ఆశాబావం వ్యక్తం చేశాడు పాక్ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజమ్. భారత్ లో పిచ్ ల మీద తమకు అవగాహన ఉందని చెప్పాడు. తమపై ఎలాంటి ఒత్తిడి లేదని...పూర్తిగా సన్నద్ధమై వచ్చామని చెప్పాడు. సొంత రికార్డుల కంటే జట్టు విజయానికే ప్రాముఖ్యతనిస్తానని చెప్పాడు బాబర్ ఆజమ్.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

China: ఇసుక తుఫాను బీభత్సం.. 693 విమాన సర్వీసులు రద్దు!

చైనాను ప్రస్తుతం బలమైన గాలులు, ఇసుక తుఫాను భీకరంగా వణికిస్తున్నాయి.భారీగా గాలులు వీస్తుండగా.. చైనా సర్కారు అప్రమత్తమైంది. మొత్తంగా 693 విమాన సర్వీసులను, వందలాది రైళ్లను రద్దు చేసింది. అలాగే ఎక్కడి వాళ్లను అక్కడే లాక్ చేసేసింది.

New Update
china

china

చైనాలో బలమైన గాలులతో పాటు ఇసుక తుఫాను హడలెత్తిస్తుంది. ఈ బీభత్సమైన విలయంతో దేశ ప్రజలంతా భయంతో విలవిల్లాడిపోతుండగా.. అదికార యంత్రాంగం అప్రమత్తం అయింది. ఎక్కడ ఉన్న వాళ్లంతా అక్కడే ఉండాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దంటూ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే వందలాది విమాన సర్వీసులను, రైళ్ల రాకపోకలను రద్దు చేసింది. 

Also Read:Whatsapp: వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..!

అంతేకాకుండా దేశంలో జరుగుతున్న ఫుట్‌బాల్ మ్యాచ్‌లు సహా ఇతర ముఖ్య కార్యక్రమాలను సైతం నిలిపి వేసింది. చైనాలో శనివారం రోజు ఉదయం నుంచే బలమైన గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు ఇసుక తుఫాను కూడా వస్తుండగా.. దేశం అంతా అల్లకల్లోలంగా మారిపోతోంది. దేశ రాజధాని బీజింగ్‌లో అయితే పరిస్థితులు మరింత దారుణంగా ఉన్నాయి. భారీ గాలులకు అనేక చెట్లు నేలకొరిగాయి. ఎత్తైన స్తంభాలు సైతం పడిపోయాయి. మనుషులు సైతం గాలికి కొట్టుకుపోతుండడం.. తీవ్రంగా ఇసుక గాల్లో కలిసి మనుషులపైకి దూసుకొస్తుండడంతో... అక్కడి సర్కారు అప్రమత్తమైంది. 

Also Read: USA: యాపిల్ కు అండగా ట్రంప్..సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లు మినహాయింపు

693 విమాన సర్వీసులను...

బీజింగ్, డాక్సింగ్‌లో మధ్యాహ్నం కల్లా వందలాది విమాన, రైల్వే సర్సీలును అక్కడి  ప్రభుత్వం రద్దు చేసింది.ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల వరకే మొత్తంగా 693 విమాన సర్వీసులను అక్కడి యంత్రాంగం రద్దు చేసింది. అలాగే స్థానికంగా ఉన్న పార్కులను తాత్కాలికంగా మూసేశారు. అంతేకాకుండా ఫుట్‌బాల్ మ్యాచ్‌లు , ఇతర ముఖ్యమైన కార్యక్రమాలను సైతం నిలిపి వేశారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఈ గాలులు, ఇసుక తుఫాను ప్రభావం కొనసాగుతుండగా.. 75 ఏళ్లలో ఎన్నడూ ఇంత శక్తివంతంగా గాలులు వీయలేదని సర్కారు చెబుతోంది. 

ముఖ్యంగా చైనా ఉత్తర, తీర ప్రాంతాల్లో ప్రమాదకర వాతావరణం ఏర్పడే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.ఎక్కడ ఉన్న ప్రజలంతా అక్కడే ఉండాలని.. బలమైన గాలులు వీస్తున్నందున ఎలాంటి ప్రమాదాలు అయినా జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని హెచ్చరికలు జారీ చేశారు. ఏదైనా అత్యవసరం అయినా అధికారుల సాయం తీసుకోవాలని చెప్పారు.

Also Read: NASA: ఆ ఐడియా ఇస్తే రూ.25 కోట్ల నజరానా.. నాసా బంపర్ ఆఫర్

Also Read: Vivo V50e 5G Offers: మచ్చా ఆఫర్ అంటే ఇదేరా.. ప్రీ బుకింగ్ స్టార్ట్.. రూ. 5వేల భారీ డిస్కౌంట్- కెమెరా సూపరెహే!

trains-cancelled | flights-cancelled | flights | china | sand storms | latest-news | telugu-news | latest-telugu-news | latest telugu news updates 

Advertisment
Advertisment
Advertisment