Political Panchangam: రేవంత్, పవన్‌కు తిరుగులేదు.. మరి చంద్రబాబు జాతకం ఎలా ఉందంటే!

రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్‌ జాతకం ఈ ఏడాది చాలా బాగుందని పండితులు చెబుతున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వారి మాటకు తిరుగులేదంటున్నారు. రేవంత్ జన్మ జాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు జాతకాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update

Political Panchangam: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,  పవన్ కల్యాణ్‌  జాతకం ఈ ఏడాది చాలా బాగుందని పండితులు చెబుతున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వారి మాటకు తిరుగులేదంటున్నారు. రేవంత్ జన్మ జాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు జాతకం కోసం ఈ వీడియో పూర్తిగా చూడండి. 

UGADI 2025 | chandrababu

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Elevated corridor : కొనసా.......గుతున్న ఉప్పల్ఎలివేటెడ్ కారిడార్..... స్థానికుల ఆందోళన.

ఉప్పల్ నుంచి వరంగల్​వెళ్లే రూట్ లో ట్రాఫిక్​సమస్యను పరిష్కరించేందుకు స్టార్ట్​చేసిన ఎలివేటెడ్​కారిడార్ పనుల్లో జాప్యంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. . ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు.

New Update
Elevated corridor

Elevated corridor

Elevated corridor : ఉప్పల్ నుంచి వరంగల్​వెళ్లే రూట్ లో ట్రాఫిక్​సమస్యను పరిష్కరించేందుకు స్టార్ట్​చేసిన ఎలివేటెడ్​కారిడార్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. శంకుస్థాపన చేసి నాలుగేండ్లు అవుతున్నా ఇప్పటివరకు పనులు పిల్లర్లు దాటలేదు. ఒకడుగు ముందుకు పడితే.. మూడడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది పరిస్థితి. ట్రాఫిక్​సమస్య పరిష్కారం కాకపోగా పనులు మరింత ట్రాఫిక్​ను సృష్టిస్తున్నాయి. ఫ్లైఓవర్​పనుల కోసం ఎక్కడికక్కడ తవ్విపోసిన మట్టి, రోడ్లపై గుంతలు, వెహికల్స్​వెళ్లే టైంలో రేగుతున్న దుమ్ముతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్​జామ్​అవుతోంది.

Also Read: నువ్వేం చేయలేవు.. నీ అయ్య తరం కాదు.. కిషన్ రెడ్డిపై భగ్గుమన్న రాజాసింగ్!

దీంతో ఆగ్రహించిన స్థానికులు ఈ రోజు అందోళనకు దిగారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ వద్దకు చేరుకున్న స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.7ఏళ్లుగా ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి చేయకపోవడంతో ఆందోళన చేపట్టినట్లు వారు తెలిపారు. స్థానికులు ఫ్లకార్డులతో ర్యాలీ నిర్వహించారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ట్రాఫిక్‌తో పాటు, ప్రమాదాల బారిన పడుతున్నామంటూ స్థానికుల ఆందోళన వ్యక్తం చేశారు. నేషనల్ హైవే అధికారుల నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ నిరసన తెలిపారు.

Also Read: వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి

ఉప్పల్ నుంచి నారపల్లి వరకు రూ.626.76 కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్​కారిడార్ నిర్మించాలని నిర్ణయించగా, 2018 మే నెలలో కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ రామంతాపూర్ వద్ద ప్రారంభమై నారపల్లి సెంట్రల్​ పవర్​రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వద్ద ముగుస్తుంది. మొత్తం 148 పిల్లర్లపై 45 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎలివేటెడ్​కారిడార్ కు ఇరువైపులా 150 అడుగుల విస్తీర్ణంతో సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని టార్గెట్​పెట్టుకోగా ఆ స్థాయిలో పనులు జరగలేదు. నాలుగేండ్లలో పిల్లర్లు వరకు మాత్రమే పూర్తిచేశారు. ప్రీ-కాస్ట్ పద్ధతిలో పిల్లర్లపై స్లాబ్​ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.148 పిల్లర్లలో128 పిల్లర్లు వేశారు. మిగిలినవి వేయాల్సి ఉంది. నారపల్లి వద్ద ఓ ఐదారు పిల్లర్లపై మాత్రమే ఇప్పటివరకు స్లాబు వేశారు. కాగా పిల్లర్ల ఏర్పాటు కోసం ఎక్కడికక్కడ తవ్విపోయడంతో రోడ్డంతా గుంతల మయంగా మారింది. వాహనాలు వెళ్తున్నప్పుడు దుమ్ము రేగుతోంది.

Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా

రామంతాపూర్ నుంచి ప్రారంభమవుతున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉప్పల్ మెట్రో లైను పైనుంచి నిర్మించాల్సి ఉంది. అయితే మొదట నిర్ణయించిన దానికంటే కారిడార్​ఎత్తును మరింతగా పెంచాలని అధికారులు నిర్ణయించారు. పెంచిన ఎత్తుకు అనుగుణంగా స్టీలు, ఇతర మెటీరియల్ ఖర్చు పెరిగింది. దీంతో పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. అలాగే కారిడార్​కు ఇరువైపులా నిర్మిస్తున్న సర్వీసు రోడ్ల కోసం భూసేకరణ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు భూమి ఇచ్చినవారికి నష్ట పరిహారం అందించడంలో నిర్లక్ష్యం చేస్తోందంటున్నారు. పరిహారాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరగా భూసేరణ చేసి కేంద్రానికి రిపోర్టు ఇవ్వడంలో తాత్సారం చేస్తుందని నిర్వాసితులు చెబుతున్నారు. అలాగే నష్టపరిహారం విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించడం కూడా లేటుకు కారణమైంది. మొత్తంగా భూసేకరణ పూర్తయితే గానీ పనుల్లో వేగం పెరగదని అధికారులు చెబుతున్నారు.

Also Read: వీధికుక్క నోట్లో అప్పుడే పుట్టిన పసికందు.. 45 రోజుల్లో మూడో ఘటన

Advertisment
Advertisment
Advertisment