/rtv/media/media_files/2025/04/04/r58rHY4l0Y1lQAFPCI9u.jpg)
BATTI VIKRAMARKA
Telangana: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్(Yadadri Thermal Power Plant) పరిధిలోని 112 మంది భూ నిర్వాసితులకు టీఎస్ జెన్‌కో ఉద్యోగాలు కల్పించింది. సంబంధిత నియామక పత్రాలను మాదాపూర్ సైబర్ గార్డెన్స్‌లో నిర్వహించిన మీటింగ్‌లో భట్టి విక్రమార్క్ అందించారు. దామచర్ల మండలం వీర్లపాలెంకు చెందిన 112 మందికి జూనియర్ అసిస్టెంట్లు, ప్లాంట్ అటెండర్లు, ఆఫీస్ సబార్డినేట్ల ఉద్యోగాలు కల్పించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పలు కీలక వ్యాఖ్యలు చేశారు. '' ప్రాజెక్టుల్లో భూములు కోల్పోయిన వాళ్లకి ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వ నేతలు చేప్పారు. భూ నిర్వాసితులు వృద్ధులైపోయినప్పటికీ ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇప్పుడు అలాంటి తప్పు జరగకుండా భూమి కోల్పోయిన వాళ్లకి వెంటనే ఉపాధి కల్పిస్తున్నాం.
Also Read: రాష్ట్రంలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం..17 వేల కోళ్లు పూడ్చివేత
53 వేల మందికి నియామక పత్రాలు
ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాటం చేసింది. వాళ్ల ఆశలు నెరవేరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏడాదిలో 53 వేల మందికి నియామక పత్రాలు అందజేశాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు పొందలేని వారికోసం ఉపాధి కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాం. రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు ఉపాధి కల్పించనున్నాం. ఈ స్కీమ్ కోసం రూ.9 వేల కోట్లు కేటాయించాం.
Also Read: వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టుకు కాంగ్రెస్ పార్టీ
ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన కంపెనీలు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టేలా ఒప్పందాలు చేసుకున్నాం. రాజీవ్‌గాంధీ సూచనల మేరకు హైటెక్ సిటీకి నేదురమల్లి జనార్దన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రాజీవ్‌గాంధీ కృషి వల్ల నేడు ఐటీ రంగంలో ఎంతోమంది ఉపాధి పొందుతున్నారు. ఫ్యూచర్ సిటీలో మరిన్ని కంపెనీలు ఏర్పాటయ్యేలా కృషి చేస్తాం. హైదరాబాద్‌ను విస్తరిస్తే మరిన్ని పెట్టుబడులు వస్తాయి. అలాగే ఉపాధి కూడా పెరుగుతుందని'' భట్టి విక్రమార్క అన్నారు.
Also Read: ట్రంప్ సుంకాల దెబ్బ.. భారీగా పడిపోతున్న చమురు ధరలు
telugu-news | rtv-news | batti-vikramarka