/rtv/media/media_files/2025/04/04/R2GVY1wloq0eUk407fzQ.jpg)
Golden silk saree
Golden silk saree : ఆదివారం శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం శ్రీ సీతారాములకు సిరిసిల్ల నేత కార్మికుడు సీతమ్మవారికి అరుదైన కానుక అందించనున్నాడు. సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ భద్రాద్రి సీతమ్మకు బంగారు పట్టు చీర రూపొందించాడు. చేనేత మగ్గం మీదే ఈ పట్టుచీరను నేయడం గమనార్హం. చీర కొంగులో భద్రాద్రి ఆలయ మూల విరాట్ దేవతామూర్తులు వచ్చే విధంగా, చీర కింది బార్డర్ లో శంఖు, చక్ర నామాలు హనుమంతుడు, గరత్మాంతుడు వచ్చే విధంగా ఈ చీరను పొందుపరిచాడు.
Also Read: టర్కీలో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 200మంది భారతీయులు 16 గంటలుగా
సిరిసిల్లకు చెందిన నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ గతంలోనూ వైవిధ్యభరితంగా బంగారు, వెండి చీరలు నేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎన్నో అవార్డులు పొందాడు. హరిప్రసాద్ ఈసారి కూడా ప్రత్యేకంగా డిజైన్ చేసి చేనేత మగ్గం పై నేసిన బంగారు పట్టుచీరను అందించనున్నారు. కల్యాణం సందర్భంగా రాముల వారికి కూడా పంచెను తన చేత్తో నేసి బహుమతిగా అందిస్తున్నానని హరిప్రసాద్ చెప్పారు. అంతేకాకుండా చీర మొత్తం శ్రీరామ శ్రీరామ రామేతి... రమే రామే మనోరమే... సహస్రనామ తత్తుల్యం... రామనామ వరాననే...అనే శ్లోకం 51 ఒక్కసార్లు వచ్చే విధంగా నేయడం విశేషం. చీరలో ఒక గ్రాము బంగారు జరీ పట్టు దారం ఉపయోగించి, ఎనిమిది వందల గ్రాముల బరువు గల ఏడు గజాల బంగారు చీర నేశాడు. సిరిసిల్ల నేత కార్మికుడు వెల్ది హరిప్రసాద్ఈ చీర వేయడానికి 10 రోజుల సమయం పట్టిందని తెలిపాడు.
ఇది కూడా చూడండి: Ap Weather Report: ఏపీ ప్రజలకు ఐఎండీ హెచ్చరికలు.. ఈ జిల్లాల్లో వర్షాలు, పిడుగులు ...!
చీరలో వన్ గ్రామ్ గోల్డ్ జరీ పట్టు దారాన్ని ఉపయోగించి ఏడు గజాల చీరను ఎనిమిది వందల గ్రాములు ఉండేవిధంగా నేశారు. ఇలా దేవతామూర్తులకు అరుదైన చీరలు నేస్తూ హరిప్రసాద్ పలువురి ప్రశంసలు అందుకున్నారు. ఈ అరుదైన చీరలను ప్రభుత్వం కొనుగోలు చేసి దేవాదాయ శాఖకు అందించాలని మా చేనేత కళను ప్రోత్సహించాలని హరిప్రసాద్ కోరారు. ప్రతి సంవత్సరం సీతారాముల కల్యాణానికి మా సిరిసిల్ల నేతన్నకు పట్టు వస్త్రాలు నేసే అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని హరిప్రసాద్ ప్రత్యేకంగా కోరుకున్నారు.గత మూడు సంవత్సరాలుగా సీతారాముల కల్యాణానికి ప్రత్యేకమైన చీరలు నేస్తున్న హరి ప్రసాద్ ను పలువురు అభినందించారు.
ఇది కూడా చూడండి: Crime News: ఐదుగురు మహిళలతో నటుడు అక్రమ సంబంధం.. 64 ఏళ్ల వయసులో మారని బుద్ధి!