/rtv/media/media_files/2025/02/23/PVVWUlnKHg70hFrpjKiz.jpg)
slbc tunnel
నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టుకాలువ టన్నెల్ లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్‌ఎఫ్, ఆర్మీ, సింగరేణి రెస్క్యూ టీమ్,హైడ్రా ,సికింద్రాబాద్ బైసన్ డివిజన్ ఇంజినీరింగ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది రక్షణ చర్యలు చేపట్టారు. సొరంగంలో మట్టి, నీరు భారీగా చేరడంతో సహాయక చర్యలకు ఆటంకమేర్పడుతోంది.
Also Read: Virat Kohli: 36ఏళ్ళ వయసులో ఈ ఇన్నింగ్స్ మంచి అనుభూతి..విరాట్
8 మంది బాధితులను క్షేమంగా రక్షించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.సొరంగం పై నుంచి లోపలికి వెళ్లే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి వెల్లడించారు. 130 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది, 120 మంది ఎస్డీఆర్‌ఎఫ్, 24 మంది ఆర్మీ,24 మంది సింగరేణి రెస్క్యూ టీమ్, 24మంది హైడ్రా సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు.సొరంగంలో 13.5 కిలోమీటర్ల వద్ద పై కప్పు కూలిపోయింది.
Also Read: Champions Trophy: పాక్ పై గెలుపుతో అదరగొట్టిన భారత్..విజయాలు సమం..
అక్కడి వరకు వెళ్లిన సహాయక బృందాలు టన్నెల్ బోరింగ్ మిషన్ వద్దకు వెళ్లేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అక్కడి నుంచి అర కిలోమీటరు వెళ్లేందుకు మట్టి,నీటితో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. హైకెపాసిటీ పంపింగ్ సెట్లు,క్రేన్లు,బుల్డోజర్ల సాయంతో ముందుకెళ్తేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్ లో 14వ కి.మీ వద్ద 100 మీటర్ల మేర 15 అడుగుల ఎత్తు బురద పేరుకుపోయింది.
8 మంది బాధితుల ఆచూకీ...
ఫిషింగ్ బోట్లు,టైర్లు,చెక్కబల్లలు వేసి దాటేందుకు ప్రయత్నిస్తున్నారు.మరో 50 మీటర్ల బురద స్థలాన్ని దాటితేనే ప్రమాద స్థలికి వెళ్లగలమని సహాయక బృందాలు చెబుతున్నాయి. ఆర్మీ వైద్య బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. 8 మంది బాధితుల ఆచూకీ ఇంకా తెలియలేదని ఎన్డీఆర్‌ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ సుఖేంద్ తెలిపారు.
సహాయక చర్యల కోసం ఈరోజు రాత్రికి నేవీ బృందం శ్రీశైలం చేరుకోనుంది.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన 8 మంది ఎలా ఉన్నారోనని బాధిత కుటుంబాల్లో ఆందోళన నెలకొంది.తమ వారి క్షేమ సమాచారం ఎప్పుడు తెలుస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బాధతులను క్షేమంగా రక్షించేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తున్నామని మంత్రులు ,అధికారులు బాధితుల కుటుంబాలకు ధైర్యం చెబుతున్నారు.
జేపీ సంస్థకు చెందిన మనోజ్ కుమార్,శ్రీనివాస్,రోజువారీ కార్మికులు సందీప్ సాహు, జక్తాజెస్, సంతోష్ సాహు,అనూజ్ సాహు ఉన్నారు.రాబిన్ సన్ సంస్థకు చెందిన ఆపరేటర్లు సన్నీ సింగ్,గురుదీప్ సింగ్ సొరంగం లోపల చిక్కుకుపోయారు.జమ్మూ,పంజాబ్, ఝార్ఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ ప్రాంతాల నుంచి వచ్చిన వీరు సొరంగంలో కొంతకాలంగా పని చేస్తున్నారు.
Also Read: champions trophy: విరాట్ కోహ్లీ ప్రభంజనం.. ఒకే మ్యాచ్‌లో మూడు రికార్డులు
Also Read: IND vs PAK Champions Trophy 2025 LIVE Updates: పాక్‌పై భారత్ ఘనవిజయం