SLBC Tunnel Rescue Operation | ఏ క్షణమైనా మృ*తదేహాలు బయటకు | SLBC Latest Updates | RTV
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో SLBC పనులు ఆగిపోయాయనీ సీఎం రేవంత్ అన్నారు.అందువల్లే టన్నెల్ కుప్పకూలిందని ఆరోపించారు. సొరంగంలో 8 మంది ప్రాణాలు పోవడానికి కేసీఆర్ కారణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది మృతి చెందారంటూ వస్తున్న వార్తలపై నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ సంతోష్ క్లారిటీ ఇచ్చారు. తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని సూచించారు. టన్నెల్ లో గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు. మృతదేహాలను రెస్క్యూ టీమ్ గుర్తించింది. డెడ్ బాడీలను మార్క్ చేసింది రెస్క్యూ టీమ్. 3 మీటర్ల మట్టిలోపల మృతదేహాల లభ్యమయ్యాయి. మృతుల్లో ఆరుగురు కార్మికులు. ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు.
ఎస్ఎల్బీసీ సొరంగంలో చిక్కుకున్న కార్మికుల జాడ ఎలా అయినా కనుక్కోవాలని ప్రభుత్వం పట్టుబట్టుకుని కూర్చొంది. దాని కోసం రకరకాల వ్యూహాలను అమలు చేస్తోంది. 120 మీటర్ల పొడవు.. 1,500 టన్నుల బరువున్న టీబీఎంను ముక్కలుగా కోయాలని నిపుణులు డిసైడ్ అయ్యారు.