/rtv/media/media_files/2025/03/06/4fmvZBXbFouwHgItlnZS.jpg)
robots, water jets in SLBC Photograph: (robots, water jets in SLBC)
ఎస్ఎల్ బీసీ సొరంగం (SLBC Tunnel) లో చిక్కుకుపోయిన కార్మికుల జాగ కనుగొనేందుకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనుల్లో వేగం మరింత పెంచేందుకు సింగరేణి నుంచి కార్మికులను రప్పించారు. నిన్న 110 మంది కార్మికులు లోపలికి వెళ్ళారు. దాంతో పాటూ టన్నెల్ పైన భూమి ఎలా ఉందో తెలుసుకునేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) ప్రతినిధులు అటవీ ప్రాంతంలో సర్వే చేశారు. హైదరాబాద్ (Hyderabad) కు చెందిన అన్వీ రోబోటిక్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు వరసగా రెండోరోజు కూడా సొరంగంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లారు. రెస్క్యూ పనుల్లో రోబోలను ప్రవేశపెట్టే విషయమై మరో ఒకటి , రెండు రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.
Also Read : రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇకనుంచి ఆ రైళ్లు సికింద్రాబాద్ స్టేషన్‌లో ఆగవు!
అలాగే సొరంగంలో ఉండిపోయిన టీబీఎం మిషన్ కత్తిరింపును కూడా మరింత వేగం చేశారు. దాని కోసం అవసరమైన సామాగ్రిని లోకో ట్రైన్ ద్వారా తెప్పించుకున్నారు. రోజుకు సుమారు ఐదడుగుల మేర మట్టిని తొలగించుకుంటూ పనులు చేస్తున్నారు. మరో రెండు రోజుల్లో సొరంగం కూలి, మట్టి పేరుకుపోయిన చోటుకు ప్రోక్లైనర్ చేరుకోవచ్చని..అప్పుడు పని మరింత సులువు అవుతుందని చెబుతున్నారు. అలాగే లోపల ఉన్న మట్టిని కన్వేయర్ బెల్ట్ మీద బయటకు పంపిస్తున్నారు. నిన్నంతా ఇది పని చేయకపోవడం వలన పని ఆలస్యం అయింది. మరోవైపు టీబీఎం పక్కన పేరుకుపోయిన బురదను వాటర్ జెట్లతో తొలగిస్తున్నారు. టీబీఎంను పూర్తిగా తొలగిస్తే కానీ ఎనిమిది మంది అవశేషాలు లభించే అవకాశాలు లేవని తెలుస్తోంది. అయితే దీనికి ఎంత సమయం పడుతుందనేది మాత్రం చెప్పలేకపోతున్నారు.
Also Read : వీల్‌ఛైర్ లేదన్న ఎయిరిండియా.. ఐసీయూలో వృద్ధురాలు
Also Read : ఈ నియమాలు పాటిస్తే.. బ్రెయిన్ షార్ప్ కావడం పక్కా
మంత్రి ఉత్తమ్ రివ్యూ..
ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర సహాయక చర్యలను పరిశీలించేందుకు మంత్రి ఉత్తమ్ (Uttam Kumar) అక్కడకు చేరుకున్నారు. సొరంతం దగ్గర పనులు పర్యవేక్షిస్తున్న అధికారులతో మాట్లాడారు. రెస్క్యూ పనులపై రివ్యూ చేస్తున్నారు. 15వ రోజు గడుస్తుండడంతో పనుల పురోగతిపై ఎలా ఉందనేది తెలుసుకుంటున్నారు. రివ్యూ అయ్యాక మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడతారని చెప్పారు. టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికుల ఎక్స్ గ్రేషియా గురించి మంత్రి ఏదైనా ప్రకటన చేయవచ్చునని సమాచారం.
Also Read: USA: సుంకాలను భారత్ తగ్గిస్తానని చెప్పింది..ట్రంప్