/rtv/media/media_files/2025/03/08/FDPzO7VTGDYBQkX7hoXD.jpg)
SLBC Tunnel Collapse: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం అధికారులతో రివ్యూ నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. టన్నెల్ లో 14 కిలోమీటర్లలో చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టేందుకు ఆటంకాలు ఎదురు అవుతున్నాయని మంత్రి చెప్పుకొచ్చారు. అక్కడ ఒకవేళ తవ్వకాలు చేపడితే రెస్క్యూ బృందాలకు సైతం ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉందన్నారు.
Also Read: ఎలన్ మస్క్‌ను రంగంలోకి దింపిన ట్రంప్.. సునీతా విలియమ్స్ తీసుకొచ్చే డేట్ ఫిక్స్!
రోబోల సహాయం తీసుకుంటాం
అందుకే రోబోల సహాయం తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. దేశంలోనే సొరంగాల్లో ఈ తరహా క్లిష్టమైన ప్రమాదం ఎక్కడా జరగలేదని అన్నారు. అందుకే నిపుణుల సలహాలు ఎప్పటికప్పుడు తీసుకుని ముందుకు వెళ్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. 14 కిలోమీటర్ల సొరంగ మార్గంలో 13 వేల950 కిలోమీటర్ల వరకూ సహాయక బృందాలు వెళ్లగలుగుతున్నాయని, చివరి 50 మీటర్లలో సహాయక చర్యలు చేపట్టడం ప్రమాదకరంగా మారిందని, అందుకే అక్కడ సహాయ చర్యలు చేపట్టేందుకు రేపటి నుంచి రోబోల సహాయం తీసుకోబోతున్నట్లుగా వెల్లడించారు. మంత్రితో పాటు కలెక్టర్ బాధావత్, సంతోష్ ఎస్పీ రఘునాథ్ , ఇతర రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: కాలిఫోర్నియా గవర్నర్ రేసులో యూఎస్ మాజీ ఉపాధ్యక్షురాలు కమలా
110 మంది కార్మికులు లోపలికి
ఎస్ఎల్ బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన కార్మికుల జాడను కనుగొనేందుకు ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పనుల్లో వేగం మరింత పెంచేందుకు సింగరేణి నుంచి కార్మికులను రప్పించారు. నిన్న 110 మంది కార్మికులు లోపలికి వెళ్ళారు. దాంతో పాటూ టన్నెల్ పైన భూమి ఎలా ఉందో తెలుసుకునేందుకు జాతీయ భూభౌతిక పరిశోధన సంస్థ(ఎన్‌జీఆర్‌ఐ) ప్రతినిధులు అటవీ ప్రాంతంలో సర్వే చేశారు. హైదరాబాద్ (Hyderabad) కు చెందిన అన్వీ రోబోటిక్స్, ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్లు వరసగా రెండోరోజు కూడా సొరంగంలోని పరిస్థితులను అంచనా వేసేందుకు వెళ్లారు.
Also Read: ఎస్సార్ఎస్పీ కాలువలో దూసుకెళ్లిన కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గల్లంతు!
Also Read: ఏడాదిలోపు చిన్నారుల్లో శ్వాసకోస సమస్యలు..ఎందుకిలా?