/rtv/media/media_files/2025/03/27/nOuc5qb7NReDfAJoGpbM.jpg)
IPL SPECIAL BUSES
ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లుగా పోటా పోటీగా ఆడుతున్నాయి. ఆ మ్యాచ్‌లు చూసేందుకు క్రికెట్ ప్రియులు స్టేడియంకు పరుగులు పెడుతున్నారు. అయితే హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ఉందంటే.. అభిమానుల రచ్చ మామూలుగా ఉండదు. దడ దడలాడించే సన్‌రైజర్స్ మ్యాచ్ కోసం తండోపతండాలుగా వెళ్తారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.
Also Read : అమెరికాలో RWA పై ఆంక్షలు..!
TGSRTC హైదరాబాద్‌లోని క్రికెట్ ప్రియులకు అదిరిపోయే తీపి కబురు అందించింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే IPL మ్యాచ్ కోసం స్పెషల్ బస్సులు నడపనున్నట్లు తెలిపింది. మ్యాచ్ కోసం వెళ్లడానికి తిరిగి రావడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్రికెట్ ప్రియులకు టీజీఎస్ ఆర్టీసీ ఈ స్పెషల్ బస్సులు నడపనుంది. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి వీటిని నడపనున్నట్లు పేర్కొంది.
Also Read : వామ్మో! రామ్ చరణ్ ఇలా ఉన్నాడేంటీ.. 'పెద్ది' లుక్ గూస్ బంప్స్
ఈ తేదీల్లో బస్సులు
ఇందులో భాగంగానే 24 డిపోల నుంచి మొత్తం 60 స్పెషల్ బస్సులు నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. వాటి తేదీల విషయానికొస్తే.. మార్చి 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21న ఈ బస్సులను నడపనున్నారు.
Also Read : బట్టతల ఉంది, పెళ్లి కావడం లేదని.. హైదరాబాద్ డాక్టర్ సూసైడ్!
బస్ స్టార్టింగ్ పాయింట్స్
ఘట్కేసర్, హయత్‌నగర్, ఎన్జీవోస్ కాలనీ, LBనగర్, కోటి, లక్డీకపూల్, దిల్‌షుఖ్ నగర్, మేడ్చల్, KPHB, మియాపూర్, JBS, ECIL, బోయిన్‌పల్లి, ఛార్మినార్, చంద్రాయణగుట్ట, మెహదీపట్నం, BHEL వంటి పాయింట్స్ నుంచి బస్సులు ప్రారంభం అవుతాయి. అయితే ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. మ్యాచ్‌లు జరిగే రోజుల్లో మాత్రమే ఈ స్పెషల్ బస్సులు నడుస్తాయి.
Also read : పాస్టర్ ప్రవీణ్ ను పక్కా ప్లాన్ తో చంపేశారు.. ఇదిగో ప్రూఫ్స్.. షర్మిల సంచలన ప్రకటన!
మెట్రో టైమింగ్స్ పొడిగింపు
ఐపీఎల్ ప్రియుల కోసం హైదరాబాద్ మెట్రో రైలు కూడా అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది. ఈ మేరకు మ్యాచ్ ఉన్న రోజుల్లో మెట్రో రైలు టైమింగ్స్‌ను పొడిగించారు. ఇప్పటి వరకు అయితే చివరి మెట్రో ట్రైన్ రాత్రి 11.00గం.లకు బయల్దేరి 12.00 గం.లకు తన గమ్యానికి చేరుకునేది. కానీ ఇప్పుడు పొడిగించిన టైం ప్రకారం.. మెట్రో ట్రైన్ రాత్రి 12.15 గం.లకు బయల్దేరి 1.10గం.లకు తన గమ్యస్తానానికి చేరుకుంటుంది. ఈ కొత్త టైమింగ్స్ మార్చి 22 నుంచే అమల్లోకి వచ్చింది. ఇది ఐపీఎల్ ముగిసే వరకు అమల్లో ఉండనుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే.. నాగోల్, ఉప్పల్ స్టేడియం, ఎన్‌జీఆర్ఐ స్టేషన్‌లలో మాత్రమే ప్రయాణికులకు ప్రవేశం ఉంటుంది.
(ipl-2025 | tgsrtc-bus | latest-telugu-news | telugu-news | uppal-stadium | hyderabad | today-news-in-telugu | latest telangana news | telangana news today | telangana-news-updates | telugu-sports-news | telugu-cricket-news)