మహబూబాబాద్ జిల్లాలో దారుణ హత్య జరిగింది.. పార్థసారథి అనే హెల్త్ సూపర్వైజర్ ను గుర్తుతెలియని వ్యక్తులు అతికిరాతంగా గొడ్డలితో నరికి చంపారు. రోడ్డు పక్కన ఉన్న మిరప తోటలోకి తీసుకెళ్ళిన దుండగులు అతన్ని అతికిరాతకంగా , దారుణంగా నరికి చంపారు. ఈ దారుణ హత్య మీద సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ జరుపుతున్నారు.
ఈ హత్య మహబూబాబాద్ మండలం భజనతండా శివారులో జరిగింది.. బైక్ పై ఒంటరిగా వెళ్తున్న పార్థసారథిని గుర్తుతెలియని వ్యక్తులు వెంబడించి అడ్డుకొని పక్కనే ఉన్న మిర్చి తోటలోకి లాక్కెళ్లారు.అక్కడ అతని అతికిరాతకంగా గొడ్డలితో నరికి తలపై మోది దారుణంగా చంపేశారు.
Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!
మృతుడు పార్థసారథి స్వస్థలం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం కాగా ఆయన ప్రస్తుతం దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాలలో హెల్త్ సూపర్వైజర్ గా పనిచేస్తున్నారు. బైక్ పై వెళ్తున్న అతన్ని పథకం ప్రకారం అడ్డగించిన గుర్తుతెలియని దుండగులు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ హత్యకు ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే దాని మీద పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Also Read: TG News: తెలంగాణలో నేటి నుంచి 3 రోజులు వడగళ్ల వానలు.. ఆ జిల్లాల్లో పిడుగులు పడే ఛాన్స్!
mahabubabad | crime | bhadrachalam | bhadrachalam-murder | warangal | warangal crime | warangal-crime-news | telugu-news | latest-news | latest-telugu-news | latest telugu news updates | murde