Road Accident: సూర్యాపేటలో ఘోర ప్రమాదం.. కాంగ్రెస్ నేత మృతి

సూర్యాపేట  జిల్లాలో ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై హోర ప్రమాదం జరిగింది. పిల్లలమర్రి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు జావీద్ మృతి చెందారు. అతివేగంతో వెళ్తున్న ఆయన వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.  

New Update
FotoJet (77)

Congress leader dies in road accident

Suryapet : సూర్యాపేట  జిల్లాలో ఖమ్మం-హైదరాబాద్ జాతీయ రహదారిపై హోర ప్రమాదం(road accident) జరిగింది. పిల్లలమర్రి శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఖమ్మం కాంగ్రెస్ నాయకుడు(congress-leader) జావీద్ మృతి చెందారు. అతివేగంతో వెళ్తున్న ఆయన వాహనం డివైడర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు.  అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. జావీద్ ప్రయాణిస్తున్న కారు నియంత్రణ కోల్పోయి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో ఆయన తీవ్ర గాయాలపాలై ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సూర్యాపేట జనరల్ ఆస్పత్రికి తరలించారు.' ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

Also Read :  వికారాబాద్ లో తీవ్ర ఉద్రిక్తత.. కల్వకుంట్ల కవిత అరెస్ట్..

భట్టి విక్రమార్క దిగ్బ్రాంతి

జావిద్ మృతి చెందడం పట్ల  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(batti-vikramarka) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి జావిద్ అందించిన సేవలు మరువలేనివని గుర్తు చేసుకున్నారు. జావిద్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. గత పది సంవత్సరాలుగా పార్టీ కష్టకాలంలో ముందుండి జావిద్ సేవలు అందించారని ఆయన గుర్తు చేసుకున్నారు. ఖమ్మం(khammam) నగర కార్పొరేషన్ మాజీ అధ్యక్షునిగా, ప్రస్తుతం పిసిసి కార్యవర్గ సభ్యునిగా, రాజీవ్ గాంధీ పంచాయతీ అభియాన్ కమిటీలో కీలక నేతగా, సేవాదళ్ రాష్ట్ర నాయకునిగా సుదీర్ఘకాలం పార్టీకి ఆయన సేవలందించారని, ఆ సేవలు మరువలేనివి అన్నారు. మహమ్మద్ జావిద్ కుటుంబానికి యావత్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని తెలిపారు. జావిద్ కుటుంబానికి ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం తన సానుభూతి తెలిపారు.

Also Read :  తెలంగాణలో పెరుగుతున్న ఎండలు.. ఆ సమయంలో ఎవరు బయటకు రావద్దని హెచ్చరిక

Advertisment
తాజా కథనాలు