/rtv/media/media_files/2025/04/11/iAiRonSyhQzSDBncv66j.jpg)
BRS Silver Jubilee
బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్‌లో సిల్వర్ జూబ్లీ సభ నిర్వహించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అయితే దీనికి పోలీసులు ఇంతవరకు అనుమతి ఇవ్వకపోవడంతో తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది, కాగా దీనిపై విచారణ జరిపిన కోర్టు బీఆర్ఎస్ వరంగల్ సభ అనుమతిపై వారం రోజుల్లో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్బంగా బీఆర్ఎస్ సభ అనుమతిపై పరిశీలిస్తున్నామని .. వారం రోజుల్లో సభ అనుమతి పై నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏప్రిల్ 17 లోపు సభ అనుమతి పై నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది హైకోర్టు. ఈ మేరకు వరంగల్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది . అనంతరం తదుపరి విచారణ ఏప్రిల్ 17 కి కోర్టు వాయిదా వేసింది.
Also Read: ఇలా అయితే ఎలా బేబీ.. జాగ్రత్తగా ఉండాలిగా..!
Also Read : సోషల్ మీడియాలో ఎక్కువ చేస్తే.. వాళ్లకు అదే ఆఖరి రోజు.. చంద్రబాబు మాస్ వార్నింగ్
BRS Silver Jubilee
బీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఏప్రిల్ 27 న హనుమకొండలోని ఎల్క తుర్తిలో సిల్వర్ జూబ్లీ బహిరంగ సభకు ప్లాన్ చేసింది. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు సభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ తెలిపింది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకొంటుంది. బీఆర్‌ఎస్ అధినేత ఆయా జిల్లాల నాయకులతో సమావేశమవుతూ దిశానిర్ధేశం చేస్తున్నారు. కాగా దీనికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. సభ అనుమతిపై వారం రోజుల్లో తేల్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సభ కోసం బీఆర్‌ఎస్ పెట్టుకున్న పర్మిషన్‌ను అనుమతించకపోవడం, దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం వల్లే హైకోర్టులో పిటిషన్ వేసినట్లు బీఆర్‌ఎస్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.
సభ నిర్వహణకు అనుమతికోసం రెండు సార్లు దరఖాస్తు చేసినా పోలీసులు స్పందించ లేదని కోర్టుకు తెలిపారు. సభ అనుమతిపై అన్ని విషయాలు పరిశీలిస్తున్నామని, వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు జీపీ తెలిపారు. స్పందించిన కోర్టు ఈనెల 17లోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ.. విచారణను 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది.
Also Read : Manchu Manoj: వీడు కన్నప్ప కాదు 'దొంగప్ప'.. మంచు మనోజ్ సంచలన ట్వీట్!
telangana-high-alert | brs leaders vs police | warangal | latest telangana news | telangana news live updates | telangana news today | telangana-news-update | latest-telugu-news | today-news-in-telugu | breaking news in telugu