/rtv/media/media_files/2025/03/16/asCccUzQ6QZhwaiFV0EO.jpg)
Elevator accidents
Elevator accidents : తెలంగాణలో వరుస లిఫ్ట్ ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బహుళ అంతస్తుల నిర్మాణాలు పెరిగినందున లిఫ్టుల వినియోగం కూడా పెరిగింది. కేవలం షాపింగ్ మాల్స్, హోటల్స్, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లోనే కాకుండా గెటెడ్, వ్యక్తిగత గృహల్లోనూ లిఫ్ట్‌లు/ఎస్కలేటర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే లిఫ్ట్‌ల తయారీ కంపెనీలపై చాలామందికి అవగాహన లేదు. ఇక బిల్డర్ల గురించి చెప్పనక్కరలేదు. నిర్మాణ ఖర్చులను తగ్గించుకునేందుకు చాలామంది తక్కువ ధరకు లభించే నాణ్యత లేని లిఫ్ట్ పరికరాలను కొనుగోలు చేసి అమర్చుతున్నారు. దీంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేకాక లిఫ్ట్ ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభుత్వ నియంత్రణ, పర్యవేక్షణ లేకపోవడంతో సమస్యలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాలకు చెక్ పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే ఏపీ, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌ల్లో అమల్లో ఉన్న లిఫ్ట్ పాలసీని తెలంగాణలోనూ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది.
Also read: US airstrikes: అమెరికా వైమానిక దాడిలో 19 మంది మృతి!
నెల 11న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిఫ్ట్ అండ్ ఎస్కలేటర్స్ బిల్లు-2025ను అసెంబ్లీ ఆమోదించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ లిఫ్ట్ పాలసీని వేగవంతంగా అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి.దీనిపై అవగాహన
అధ్యయనం, ముసాయిదా రూపకల్పన కోసం రెండు రోజుల క్రితం ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ లిఫ్ట్ యాక్ట్– 2015 ముసాయిదాకు మెరుగులు దిద్దాలని ఆదేశించింది. అలాగే, ఇతర రాష్ట్రాల్లో పాలసీ ఏ విధంగా ఉందనే అంశంపై ఆరా తీసే పనిలో తెలంగాణ ప్రధాన విద్యుత్ తనిఖీ విభాగం నిమగ్నమైంది.
Also read: Pakistan terrorist : పాకిస్తాన్‌లో హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది
అపార్ట్‌మెంట్ నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) ఇవ్వడానికి పురపాలక శాఖ అమలు చేస్తున్న జీఓ 168లో లిఫ్ట్ ఏర్పాటు గురించి ప్రస్తావన ఉన్నా.. దాని నాణ్యత, నిర్వహణ, నియంత్రణపై ఎలాంటి ఆంక్షలు లేవు. తెలంగాణ ఎలివేటర్స్ అండ్ ఎస్కలేటర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఏటా 10 వేల వరకు ఎలివేటర్లను విక్రయిస్తున్నారు. వీటిలో 20 శాతమే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) ప్రమాణాల మేరకు ఉన్నట్లు అంచనా.ఈ చట్టం అమలులోకి వస్తే లిఫ్ట్ పాలసీలో లిఫ్ట్ ఇండస్ట్రీలు, స్పేర్ పార్ట్స్తయారు చేసే సంస్థలు, భవన యజమానులు లిఫ్ట్ ల ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి అనుమతి తప్పనిసరి చేయనున్నారు. ఇప్పటివరకు భవన నిర్మాణాల్లో సేఫ్టీని పర్యవేక్షించే విద్యుత్ తనిఖీ విభాగం.. లిఫ్ట్ భద్రతను కూడా పర్యవేక్షణ చేయనుంది.
Also Read : మ్యాట్రీమోనీతో వల.. రెండో పెళ్లి, ఆంటీలనే టార్గెట్ చేస్తూ..
లిఫ్టులపై కొత్త పాలసీ అమల్లోకి వస్తే కొంతమేరకు ప్రమాదాలను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్ ఎంసీలోని టౌన్ ప్లానింగ్ విభాగాల నుంచి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనుమతులు పొందడంతో పాటు ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు పొందాలి. అలాగే, లిఫ్టులు, బడా ఎలివేటర్లు ఏర్పాటు చేసుకోవడానికి భవన యజమానులు ఎలక్ట్రికల్ ఇన్ స్పెక్టర్ విభాగం నుంచి క్లియరెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ తనిఖీ విభాగం లిఫ్ట్ పాలసీ రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తుంది.
ఇది కూడా చూడండి: రన్యారావు కేసు పై సీబీ'ఐ'..హడలి పోతున్న నేతలు!
వీటితో పాటు లిఫ్టుల మీదా జీహెచ్‌ఎంసీ తనిఖీ తప్పనిసరి చేయనుంది. అధికారుల పర్యవేక్షణతో పాటు ఆయా ప్లాట్ల యజమానుల అసోసియేషన్లు లిఫ్టుల వినియోగంపై దృష్టి చారించేలా రేవంత్ సర్కార్ చట్టం తీసుకురానుంది. గెటెడ్ కమ్యూనిటీ, షాపంగ్ మాల్స్ తదితర ప్రాంతాల్లో లిఫ్ట్ సమస్యలపై ఆయా ప్లాట్ల యజమానులు ఫిర్యాదు చేసేలా టోల్ ఫ్రీ నెంబర్ తీసుకువచ్చే అవకాశం ఉంది. ప్రతి ఐదు లేదా పదేండ్లకు ఒకసారి లిఫ్టుల నాణ్యతపై ఫిట్‌నెస్ సర్టిఫికెట్ తీసుకోవడాన్ని కూడా ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది.
ఇది కూడా చూడండి: దుమారం రేపుతున్న మహాత్మాగాంధీ మనువడి వివాదాస్పద వ్యాఖ్యలు...