🔴 Live News: రిటైర్మెంట్ పై రోహిత్, కోహ్లీ క్లారిటీ.. ఫ్యాన్స్ కు పండగే!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!
యాంకర్ రష్మీ పెట్ మృతి చెందడంతో అస్థికలను గోదావరి నదిలో కలిపింది. ఈ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నిన్ను ప్రేమించే అవకాశం కోసం నేను జీవితాంతం మిస్ అవుతూనే ఉంటానని.. పునర్జన్మ ఉంటే నువ్వు పుడతావని కోరుకుంటున్నానని తెలిపింది.
ఈ ఏడాది ఆస్కార్ వేడుకకు పాప్ సింగర్, నటి సెలీనా గోమెజ్ ఔట్ ఫిట్ ప్రత్యేకంగా నిలిచింది. 16వేల క్రిస్టల్స్‌ను పొదిగిన రోజ్ గోల్డ్ గౌనులో సెలీనా రెడ్ కార్పెట్‌పై హొయలొలికించింది. చూపరులను మంత్రముగ్దుల్ని చేసిన లుక్స్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆస్కార్ 2025 వేడుకల్లో అమెరికన్ ఫిల్మ్ 'అనోరా' చిత్రానికి అవార్డుల పంట పండింది. ఉత్తమ సినిమా, ఉత్తమ నటి, ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ స్క్రీన్ ప్లే, ఉత్తమ ఎడిటింగ్ ఇలా ఐదు విభాగాల్లో 'అనోరా' చిత్రానికి అవార్డులు వరించాయి.
తెలుగు హీరోల డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. తక్కువ బడ్జెట్‌తో మంచి కలెక్షన్లను సాదిస్తుండడంతో బాలీవుడ్ ప్రొడ్యూసర్లు సైతం మన హీరోలతో మూవీస్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా “కిల్” మూవీ డైరెక్టర్ రామ్ చరణ్ తో సినిమా తీసేందుకు ప్లాన్ చేస్తున్నాడు.
అక్కినేని కోడలు నటి శోభిత ధూళిపాళ్ల వివాహం తర్వాత తన మొదటి ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో పాల్గొంటుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రొడ్యూసర్ సెలగంశెట్టి కేదార్ ఆకస్మిక మరణం తెలుగు ఇండస్ట్రీలో గుబులు రేపుతోంది. టాప్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ లకు బినామీగా వ్యవహరించిన కేదార్ వారికి చెందిన వందల కోట్ల రూపాయలతో దుబాయ్‌లో వ్యాపారాలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
లెజెండరీ హాలీవుడ్ నటుడు జీన్ హ్యాక్‌మ్యాన్ అనుమానాస్పద మృతి చెందారు. న్యూమెక్సికోలోని ఇంట్లో ఆయనతోపాటు ఆయన భార్య, పెంపుడు కుక్క చనిపోయి ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హాక్మన్ వయసు 95 ఏళ్లు కాగా ఆయన భార్య వయసు 63.
దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం ఓటీటీలో కొత్త రికార్డ్ సృష్టించింది. నెట్ ఫ్లిక్స్ లో 13 వారల పాటు ట్రెండింగ్ లో ఉన్న తొలి సౌత్ ఇండియన్ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు.