/rtv/media/media_files/2025/03/03/DJuHNF2dTjkKioSKDD6I.jpg)
Selena Gomez special attraction Oscars 2025
Oscar 2025: సినీ ప్రపంచానికి ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ వేడుక ఈ యేడాది మరింత ఘనంగా జరిగింది. డాల్బీ థియేటర్ (Dolby Theatre) లో కన్నుల పండుగగా జరిగిన ఈవెంట్‌లో సెలబ్రిటీలు ట్రెండీ డ్రెస్సుల్లో దర్శనమిచ్చి రెడ్ కార్పెట్‌పై హొయలొలికించారు.
Also Read : ఛీ.. ఛీ మీరు మనుషులేనా.. నెల రోజుల చిన్నారికి 40 వాతలు పెట్టిన కుటుంబ సభ్యులు
Also Read : యూఎస్ ఎయిడ్ నిధులపై కేంద్రం కీలక ప్రకటన..
ముఖ్యంగా పాప్ సింగర్, నటి సెలీనా గోమెజ్ (Selena Gomez) ఔట్ ఫిట్ ఈ ఆస్కార్ వేడుకకే ప్రత్యేకంగా నిలిచింది. 16వేల క్రిస్టల్స్‌ను పొదిగిన రోజ్ గోల్డ్ గౌనులో హాజరై చూపరులను మంత్రముగ్దుల్ని చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతుండగా డిజైనర్లు సైతం ఔరా అంటూ నోరెళ్లబెడుతున్నారు.
Also Read : Supreme Court: పోలీసులు ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి: సుప్రీం కోర్టు
అద్భుతమైన వస్తువుల ఎంపిక..
12 మంది కళాకారులు రూపొందించిన ఈ గౌను ధరించిన సెలెనా.. అందరి దృష్టి ఆమెపై ఉండేలా చూసుకున్నారు. ఇది నిజమైన కళాఖండం. చేతితో చేసిన క్లిష్టమైన డిజైన్, ఎంబ్రాయిడరీ. చేతితో కుట్టిన రోజ్‌మాంట్ స్ఫటికాలు. ఆశ్చర్యకరమైన 16వేల క్రిస్టల్స్ అలంకరణ అద్భుతం అంటూ వేడుకపై నిర్వాహకులు ప్రశంసలు కురిపించారు. అంతేకాదు ఆమె ధరించిన స్టేట్‌మెంట్ నెక్లెస్, డ్రాప్ చెవిపోగులు, ఉంగరాలు, హెయిర్ స్టైల్, వంటి అద్భుతమైన వస్తువుల ఎంపిక ఆమె అందాన్ని మరింత రెట్టింపు చేశాయి.
Also Read : విరాట్ - ధోనీకి రాని ఘనత రిషబ్ పంత్‌కు దక్కింది.. ఎమోషనల్ పోస్ట్ వైరల్!
విజేతలు వీళ్లే!
ఉత్తమ సహాయ నటుడు - కీరన్ కైల్ కల్కిన్ (ది రియల్ పెయిన్)
ఉత్తమ సహా నటి - జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్)
ఒరిజినల్ సాంగ్ - ఎల్ మాల్ (ఎమిలియా పెరెజ్)
ఉత్తమ స్క్రీన్‌ప్లే - అనోరా (సీన్ బేకర్)
ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే - కాన్‌క్లేవ్ (పీటర్ స్ట్రాగన్)
ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ - వికెడ్ (పాల్ తేజ్‌వెల్)
యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ - ఫ్లో
ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ - ఇన్ ది షాడో ఆఫ్ ది సైప్రెస్
ఉత్తమ మేకప్, హెయిల్‌స్టైల్ - ది సబ్‌స్టాన్స్
ఉత్తమ ఎడిటింగ్ - అనోరా (సీన్ బేకర్)