🔴 Live News: రిటైర్మెంట్ పై రోహిత్, కోహ్లీ క్లారిటీ.. ఫ్యాన్స్ కు పండగే!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

Rains: మండుతున్న ఎండల్లో వాతావరణశాఖ చల్లటి వార్త.. 3 రోజులపాటు వానలే..వానలు!

ఈసారి ఎండలు ఫిబ్రవరి నెల నుంచే మండిపోతున్నాయి. ప్రతి ఏటా మార్చిలో ప్రారంభం అయ్యే ఎండలు ఈసారి ఫిబ్రవరిలోనే మొదలయ్యాయి. దీంతో మార్చి నెల వచ్చేసరికే సూరీడు మండుతున్నాడు. రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఏప్రిల్, మే నెలల్లో ఏ స్థాయిలో ఎండలు ఉంటాయోనన్న భయం నెలకొంది. అయితే ప్రస్తుతం భానుడి ప్రతాపం నుంచి కాస్తా ఉపశమనం లభించనుంది. రానున్న 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడించింది.

Also Read: Niharika Konidela: నిన్ను అత్యంత ప్రేమిస్తున్నాను.. నిహారిక ఎమోష‌న‌ల్ పోస్ట్ ఎవ‌రి గురించో తెలుసా!

రాబోయే 3 రోజుల పాటు పుదుచ్చేరి, తమిళనాడు, కారైకల్‌లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం ఉంటుందని వెల్లడించింది. దీంతో ఆ ప్రాంతాల్లో భారీ ఎండలు, ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్నవారికి కొంత ఊరట కలగనుంది. మార్చి 10, 11, 12వ తేదీల్లో ఈ మూడు ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులు ఉంటాయని తమిళనాడులోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మార్చి 10వ తేదీన తమిళనాడు తీరప్రాంతంలోని కొన్ని ప్రదేశాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.

Also Read: Horoscope Today: నేడు ఈ రాశివారికి అసలు బాలేదు..కాస్త జాగ్రత్తగా ఉండండి!

ఇక మార్చి 11వ తేదీన తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. మరోవైపు.. మార్చి 12వ తేదీ నాటికి దక్షిణ తమిళనాడులోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.

మార్చి 11వ తేదీన తెల్లవారుజామున దక్షిణ తమిళనాడులో.. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ ఎక్స్ వేదికగా తెలిపింది. వర్ష ప్రభావిత జిల్లాల్లో కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్‌కాసి, తూత్తుకుడి, విరుదునగర్, రామనాథపురం ఉన్నాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఈరోజు నుంచి  12, 13వ తేదీల్లో కేరళ, మహే, కోస్తా, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది.

Also Read: Elan Musk: ఎక్స్‌ సేవల్లో అంతరాయం..ఇది భారీ సైబర్‌ దాడే అంటున్న మస్క్‌!

Also Read: Cyber Crimes: సైబర్‌ నేరగాళ్ల వలలో భారతీయులు.. ఎట్టకేలకు 500 మంది స్వదేశానికి

  • Mar 11, 2025 08:19 IST

    విషాదం.. ఫార్మసీ విద్యార్థిని బలిగొన్న రెండుక్షరాల ప్రేమ

    బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోప్రియాంక అనే ఫార్మసీ విద్యార్థి ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటూ చదువుతోంది. ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో సూసైడ్ లేఖ రాసి హాస్టల్ గదిలోనే ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

    suryapet 24 years woman suicide due to dowry harassment in hyderabad
    Suicide

     



  • Mar 11, 2025 08:17 IST

    ప్రణయ్‌పై ఇన్‌స్టాలో అమృత షాకింగ్‌ పోస్ట్‌

    మిర్యాలగూడ ప్రణయ్ హత్య కేసులో కోర్టు  సంచలన తీర్పు వెలువరించింది.  నిందితుల్లో ఒకరికి ఉరిశిక్ష, మిగిలిన వారికి జీవిత ఖైదు విధించింది.  ఈ క్రమంలో కోర్టు తీర్పును అమృత స్వాగతిస్తూ రెస్ట్‌ ఇన్‌ పీస్‌ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టింది.  

    amruta praney



  • Mar 11, 2025 08:17 IST

    రిటైర్మెంట్ పై రోహిత్, కోహ్లీ క్లారిటీ.. ఫ్యాన్స్ కు పండగే!

    ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనంతరం వన్డేలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌ ప్రకటిస్తారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు వచ్చాయి. అయితే ఫైనల్‌ మ్యాచ్  అనంతరం రోహిత్, కోహ్లి చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి

    roko fans



  • Mar 11, 2025 08:16 IST

    ప్రధాని మారిషస్ పర్యటన.. ఇండియా ఫండ్స్‌తో 20 ప్రాజెక్టులు ప్రారంభం

    ప్రధాని మోదీ 2 రోజుల మారిషస్ పర్యటనకు వెళ్లారు. మార్చి 11, 12 తేదీల్లో ఇండియా సహకారంతో జరిగిన అభివృద్ధి పనులను ఆయన ఆ దేశ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులంతో కలిసి ప్రారంభించనున్నారు. అలాగే మారిషస్ జాతీయ దినోత్సవ వేడుకల్లో పాల్గొననున్నారు.

    _visit to Mauritius
    _visit to Mauritius Photograph: (_visit to Mauritius)

     



  • Mar 11, 2025 08:14 IST

    హైదరాబాద్‌లో విషాదం.. పిల్లలకు విషమిచ్చి ఆ తర్వాత భార్యాభర్తలు ఆత్మహత్య

    హైదరాబాద్‌లోని హబ్సీగూడలో ఓ కుటుంబం మొత్తం మృతి చెందింది. మానసిక, ఆర్థిక సమస్యల వల్ల చంద్రశేఖర్ అనే వ్యక్తి ఇద్దరు పిల్లలను చంపేసి, ఆ తర్వాత భార్యతో కలిసి ఆత్మహత్య చేసకున్నాడు. తన చావుకి ఎవరూ కారణం కాదని సూసైడ్ లేఖలో రాసి చనిపోయాడు.

    Habsiguda
    Habsiguda Photograph: (Habsiguda)

     



  • Mar 11, 2025 08:13 IST

    ఓర్నీ.. నవ వధువుతో బీజేపీ నేత పరార్ !

    నవ వధువుతో బీజేపీ నేత పరార్ అయిన ఘటన  నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళ్తే కార్వాన్ నియోజకవర్గంలోని గోల్కొండ డివిజన్ బీజేపీ మాజీ అధ్యక్షుడు గురజాల అరవింద్ (46) కు ఇప్పటికే పెళ్లి అయింది.

    bjp leader na vadhuvu



  • Mar 11, 2025 08:13 IST

    విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ ..సీఐడీ నోటీసులు

    మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. రేపు అంటే మార్చి 12వ తేదీ ఉదయం11 గంటలకు విజయవాడ ఆఫీస్‌కు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

    Vijaysai Reddy sensational post Viral
    Vijaysai Reddy sensational post Viral Photograph: (Vijaysai Reddy sensational post Viral)

     



Advertisment
Advertisment
Advertisment