/rtv/media/media_files/2025/02/27/KRT5QRvbCM9j50M2VWGo.jpg)
టాలీవుడ్ (Tollywood) యంగ్ ప్రొడ్యూసర్ సెలగంశెట్టి కేదార్ (Selagamsetty Kedar) ఆకస్మిక మరణం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోని టాప్ హీరోల గుండెల్లో గుబులు రేపుతోంది. ఇండస్ట్రీకి చెందిన టాప్ హీరోలు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్ లకు బినామీగా వ్యవహరించిన కేదార్ వారికి చెందిన వందల కోట్ల రూపాయలతో దుబాయ్‌లో వ్యాపారాలు చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కేదార్ ఆకస్మిక మరణంతో తమ డబ్బుల పరిస్థితేంటి ఏంటని ఇండస్ట్రీలోని కొంతమంది ప్రముఖులు తలలు పట్టుకుంటున్నారట.
Also Read : ఫైనల్లీ 'సంక్రాంతికి వస్తున్నాం' ఓటీటీ డేట్ ఫిక్స్.. టీవీలో కూడా అదే రోజు?
హైదరాబాద్‌లోని ర్యాడిసన్ హోటల్ (Radison Hotel) లో బయటపడిన డ్రగ్స్ కేసు అంశంలో సెలగంశెట్టి కేదార్ పేరు ప్రముఖంగా వినిపించింది. దీంతో అతను దుబాయ్ కు షిప్ట్ అయి అక్కడ ఖరీదైన ఓ ఫ్లాట్‌లో నివాసముంటూ రియల్ ఎస్టేట్, కన్‌స్ట్రక్షన్ వ్యాపారాలు చేస్తూ పలు లేక్‌వ్యూ ప్రాజెక్టులు చేపట్టాడని సమాచారం. అంతేకాకుండా కేదార్ కోట్లు విలువచేసే ఓ పెద్ద ల్యాండ్ డెవలపింగ్ కంపెనీలో కీలక వాటాదారుడిగా ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : యాక్షన్ తో దుమ్ములేపిన సల్లు భాయ్.. సికిందర్ టీజర్ చూశారా?
తరచూ దుబాయ్ వెళ్లి
కేదార్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్న అగ్ర హీరోలు, నిర్మాతలు, దర్శకులు కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఆయా వ్యాపారాల్లో వందల కోట్లు పెట్టుబడి పెట్టినట్లుగా తెలుస్తోంది. వీరందరికీ కేదార్ బినామీగా వ్యవహరించేవాడని సమాచారం. తమ డబ్బుల విషయంలో కేదార్ ను కలిసేందుకు ప్రముఖులు తరచూ దుబాయ్ వెళ్లేవారని అక్కడే మూడు నాలుగు రోజులు ఉండి తమ పనులు చూసుకుని వచ్చేవారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది. అయితే ఈ పెట్టుబడుల లెక్కలన్నీ కేదార్ కే తెలియడంతో అతడిని నమ్మి పెట్టుబడుల కోసం డబ్బులు ఇచ్చిన ప్రముఖుల పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారిందట. ఏ ప్రాజెక్టులో ఎంత డబ్బు ఉందో తెలియక తలుల పట్టుకుంటున్నారట.
Also Read : ఆ పాట పాడినందుకు సిగ్గుగా ఉంది! కత్రినా పాటపై శ్రేయా ఘోషల్ హాట్ కామెంట్స్
కేదార్ మరణ వార్త బయటకు రాగానే అతనితో వ్యాపార సంబంధాలు పెట్టుకున్నారంటూ కొంతమంది సినీ,రాజకీయ ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేరు రావడంతో ఆయన స్పందించారు. కేదార్ చనిపోయిన సమయంలో తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని.. తనపై అసత్యప్రచారం జరుగుతోందని తెలిపారు. ఇక కేదార్ మరణించినప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే దుబాయ్ లోనే ఉన్నట్టుగా సమాచారం.
Also read : Jyotika: నీ భర్త కంటే విజయ్ బెటర్.. జ్యోతిక మాస్ రిప్లై.. మళ్ళీ వెంటనే డిలీట్!